‘జగనవి అవగాహన లేని నిర్ణయాలు’

ABN , First Publish Date - 2022-10-03T05:16:46+05:30 IST

పరిపాలనపై సరిగా అవగాహన లేక ముఖ్యమంత్రి జగన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని రాషా్ట్రన్ని నాశనం చేస్తున్నాడని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.పవనకుమార్‌ గౌడు పేర్కొన్నారు.

‘జగనవి అవగాహన లేని నిర్ణయాలు’
మాట్లాడుతున్న పవన కుమార్‌ గౌడు

గుంతకల్లు, అక్టోబరు 2: పరిపాలనపై సరిగా అవగాహన లేక ముఖ్యమంత్రి జగన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని రాషా్ట్రన్ని నాశనం చేస్తున్నాడని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.పవనకుమార్‌ గౌడు పేర్కొన్నారు. పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షా శిబిరంలో టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు ఆదివారం ఉదయం దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా పవనకుమార్‌ గౌడు దీక్షాపరులకు పూలమాలలను వేసి దీక్షలను ప్రారంభించారు. టీడీపీ వైద్య విభాగ జిల్లా నాయకురాలు పత్తి హిమబిందు, ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జింకల జగన్నాథ్‌, చికెన జగన, ప్రతా్‌పనాయుడు, మస్తాన యాదవ్‌, వెంకటేశులు, కేశప్ప, మస్తానప్ప, రాము, సురేశ, నందీశ్వర్‌, వెంకటేశ్వర్లు, ఫ్రూట్‌ మస్తాన, గిడ్డయ్య, బీకే మధు, వెంకటేశులు, ఈశ్వర్‌, ఓబన్న, మీఠూ నాయక్‌, రాముడు, బీఎస్‌ కృష్ణారెడ్డి, హనుమంతు, రామన్న చౌదరి, లక్ష్మయ్య, శివన్న, అబ్దుల్లా, ఖాజా, ఇస్మాయిల్‌, ఫజులు, నరసింహులు, మహదేవ్‌ పాల్గొన్నారు.Read more