జగన.. ముస్లింల ద్రోహి

ABN , First Publish Date - 2022-06-28T06:59:17+05:30 IST

ముస్లింల సంక్షేమ పథకాలను ఎత్తివేస్తూ ముస్లింల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన నిలిచిపోయారని టీడీపీ మైనార్టీ నేతలు ధ్వజమెత్తారు.

జగన.. ముస్లింల ద్రోహి
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ మైనారిటీ నాయకులు

టీడీపీ మైనార్టీ విభాగం నాయకుల ఆగ్రహం

అనంతపురం టౌన జూన 27 : ముస్లింల సంక్షేమ పథకాలను ఎత్తివేస్తూ ముస్లింల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన నిలిచిపోయారని టీడీపీ మైనార్టీ నేతలు ధ్వజమెత్తారు. దుల్హన పథకం ఎత్తివేతపై సోమవారం టీడీపీ మైనారిటీ సెల్‌ అనంత జిల్లా అధ్యక్షుడు సాలార్‌ బాషా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ టీడీపీ నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన జగన.. ఇప్పుడు ఉన్న పథకాలను ఎత్తివేయడం  దుర్మార్గమ న్నారు. ముస్లింల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హాన, విదేశీ విద్య, ఎనటీఆర్‌ విద్యోన్నతి, ఇస్లామిక్‌ బ్యాంక్‌ తదితర సంక్షేమ పథకాలను యథాతతంగా కొనసాగించాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లీం, మైనారిటీ నాయకులు సైఫుద్దిన, గౌస్‌పీరా, జేఎం బాషా, బాబావలి, ఎస్‌ఎం బాషా, రజాక్‌, రఫీ, పూల బాషా, షౌకతఖాన, మున్వర్‌, మున్నా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:59:17+05:30 IST