యోగివేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-12-07T23:38:08+05:30 IST
మహాకవి యోగివేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర రెడ్డిసంఘం అధ్యక్షుడు గంగులగుంట నరే్‌షకుమార్‌రెడ్డి అన్నారు.
మడకశిరటౌన, డిసెంబరు 7: మహాకవి యోగివేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర రెడ్డిసంఘం అధ్యక్షుడు గంగులగుంట నరే్‌షకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. రెడ్డి కులస్తుల స్థితిగతులను అధ్యయనం చేయడంలో భాగంగా రెడ్డి కుటుంబ సభ్యులను సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి కులస్తులు 12 శాతానికి పైగా ఉన్నారని, ఇందులో ఎక్కువ శాతం పేదలుగా జీవనం సాగిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంక్షేమ పథకంలోను అవకాశం కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. యోగివేమన జయంతిని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విధంగానే మనరాష్ట్రంలోనూ నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, నాయకులు ఆర్.నితినరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అభిషేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.