ఎన్నికల్లో జగనకు తగిన బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2022-12-07T00:08:48+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగనకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

 ఎన్నికల్లో జగనకు తగిన బుద్ధి చెప్పాలి

ఇదేం ఖర్మలో టీడీపీ నాయకులు

ధర్మవరం, డిసెంబరు 6: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగనకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ- మనరాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 25వ వార్డులో టీడీపీ ఆ వార్డు ఇనచార్జ్‌ భీమనేని ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ... ప్రజలతో ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంజగనకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్తునప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు టీడీపీ నాయకు లు పేర్కొంటున్నారు. నాయకులు పరిశే సుధాకర్‌, చీమల రామాంజి, గడ్డంసూరి, నాగేంద్ర, అంకన్న, ఖండే గంగాధర్‌, ఖండే రామాంజనే యులు, వీరా, జయరాం, రవి, శ్రీనివాసులు, కాయల రామాంజి, చీమల సుబ్బరాయుడు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

కదిరి అర్బన: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రా నికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని 34వ వార్డులో టీడీపీ నాయకులు పర్యటించారు. వార్డు ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యా వసర ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనికి తోడు ప్రభుత్వం పలు రకాలుగా పన్నులు వేసి పేదలకు మరింత భారాన్ని మోపుతున్నట్లు ఆ రోపించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్‌ ఇర్పాన, స్థానిక నాయకులు గంగిశెట్టి, హుస్సేనబాషా, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లచెరువు: వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తోందని ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో గ్రామాల ప్రజలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌ పీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలుమండలంలోని పీ కొత్తపల్లి, పోలేవాండ్లపల్లి, బాలినేని ఎగువతండా, దిగువతండా, మలకవారిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలను వివిధ నిబంధనలతో ప్రజలకు దూరం చేస్తూ మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాబూసాబ్‌, అంజనప్ప, తెలుగు యువత ప్రసాద్‌, నాగభూషణం నాయుడు, అశ్వత్థనాయుడు, రాజారెడ్డి, రామ్మోహన, దేవేంద్రగౌడ్‌, వైసీ వెంకటరెడ్డి, జింకా శివయ్య, సర్పంచ సూరి, లక్ష్మీపతి నాయుడు, రమేష్‌ నాయుడు, కిరణ్‌ నాయుడు, జయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:08:52+05:30 IST