ధర్మవరంలో ప్రజలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-12-07T23:42:16+05:30 IST

ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో మళ్లీ పాతరోజులు వస్తున్నాయని, అప్పట్లో పరిటాల రవీంద్ర ప్రజలకు అండగా నిలిచిన విధంగా ప్రస్తుతం తానున్నానని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ వైసీపీనేతలను హెచ్చరించారు.

ధర్మవరంలో ప్రజలకు అండగా ఉంటా

పాతరోజులు పునరావృతం అవుతున్నాయి

అధికారులే ఉండలేకపోతున్నారు

ప్రశాంతతకు భంగం కలిగిస్తే సహించం

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో పరిటాలశ్రీరామ్‌

ధర్మవరం, డిసెంబరు 7: ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో మళ్లీ పాతరోజులు వస్తున్నాయని, అప్పట్లో పరిటాల రవీంద్ర ప్రజలకు అండగా నిలిచిన విధంగా ప్రస్తుతం తానున్నానని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ వైసీపీనేతలను హెచ్చరించారు. పట్టణంలోని 1,2 వార్డులలో బుధవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో పరిటాలశ్రీరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. గతప్రభుత్వ హయాంలో ప్రజలకుఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఆరాతీశారు. ప్రతి ఇంటి వద్ద ఆయన పోస్టర్లను అతికించారు. అనంతరం పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ...నియోజకవర్గంలో ఉన్నతాధి కారులు వరుసగా సెలవులపై వెళ్తుండటంపై స్ప్దందించారు. వైసీపీ నేతలకు వత్తా సు పలకలేక అధికారులు పారిపోతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో విద్యుతచార్జీలు, ముడిసరుకుల ధరలను ప్రస్తుత ధరలతో పరిశీలించాలన్నారు. మరోవైపు అధికార పార్టీ నాయ కుల అరాచకాలు అధికమయ్యాయన్నారు. తాము చెప్పిందే వేదం అని ఎమ్మెల్యే మొండిగా వెళ్తున్నారని, అందుకు ఎదురు తిరిగినందుకే డీఎస్పీపై వేటుపడిందన్నారు. అలాగే ఇప్పుడు భూ అక్ర మాలకు వంతపాడలేదని తహసీల్దార్‌ను వేధించారని అందుకే ఆయనా సెలవుపై వెళ్లారన్నారు. పాలకవర్గం నుంచి ఎదురయ్యే సమస్యలతో కమిషనర్‌ కూడా సెలవుపై వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. అధికారం ఎప్పుడూ ఉండదని, ప్రజల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాళ్లు సాహెబ్బీ, బీబీ, టీడీపీనాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, బోయ రవిచంద్ర, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, రాంపురం శీన, పరిశే సుధాకర్‌, నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్‌, అంబటి సనత, క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, గంగారపు రవి, పఠాన బాబుఖాన, చిన్నూరు విజయ్‌చౌదరి, కేహెచ ప్రకాశ, అత్తర్‌ రహీం, చిన్నూరు భాస్కర్‌చౌదరి, టైలర్‌ కుళ్లాయప్ప, కేశాగాళ్ల శీన, గిరిక నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:42:21+05:30 IST