కులాన్ని దూషిస్తే ఊరుకోం: కమ్మ సంఘం

ABN , First Publish Date - 2022-08-09T05:41:58+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్‌ తన తప్పులను కప్పిపుచ్చుకోవాడానికి కమ్మ కులాన్ని దూషిస్తే ఊరుకోబోమని కమ్మ సంఘం నాయకులు హెచ్చరించారు.

కులాన్ని దూషిస్తే ఊరుకోం: కమ్మ సంఘం
ర్యాలీ నిర్వహిస్తున్న కమ్మసంఘం నాయకులు

ఉరవకొండ, ఆగస్టు 8 : ఎంపీ గోరంట్ల మాధవ్‌ తన తప్పులను కప్పిపుచ్చుకోవాడానికి కమ్మ కులాన్ని దూషిస్తే ఊరుకోబోమని కమ్మ సంఘం నాయకులు హెచ్చరించారు. పట్టణం లో సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేష న వరుకూ ర్యాలీ చేపట్టారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే పార్టీ నుంచి, పార్లమెంటు నుంచి డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కమ్మ కులాన్ని దూషించిన ఎంపీపై కేసును నమోదు చేయాలని పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కమ్మ సంఘ నాయకులు శ్రీరాములు, మల్లికార్జున, కేశన్న, బోస్‌, ప్రభాకర్‌, చంద్రమెహన తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:41:58+05:30 IST