ఎంత పని చేశావు అమ్మా..!

ABN , First Publish Date - 2022-05-28T06:24:20+05:30 IST

పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో నివాసముంటున్న కుమార్తె ఇల్లు వదిలి వెళ్లిందని మనస్తాపం చెందిన తల్లి ఉమాదేవి(42) ఇంటిపైకప్పునకు తాడుతో ఉరివేసుకుని, మరణించింది.

ఎంత పని చేశావు అమ్మా..!
తల్లి ఉమాదేవి(ఫైల్‌)

కుమార్తె ఇల్లు వదిలి వెళ్లిందని తల్లి ఆత్మహత్య 


గోరంట్ల, మే 27: పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో నివాసముంటున్న కుమార్తె ఇల్లు వదిలి వెళ్లిందని మనస్తాపం చెందిన తల్లి ఉమాదేవి(42) ఇంటిపైకప్పునకు తాడుతో ఉరివేసుకుని, మరణించింది. సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన లింగమూర్తి, ఉమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె లక్ష్మిని టెక్స్‌టైల్స్‌ డిప్లమో చదివించారు. రెండు దశాబ్దాల కాలంగా కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో నివాసముంటున్నారు. కుమార్తె లక్ష్మి టెక్స్‌టైల్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. తోటి ఉద్యోగితో ప్రేమాయణం నడుస్తుండగా విషయం తల్లిదండ్రులు తెలిసింది. ఉద్యోగం వదిలించి, దొడ్డబళ్లాపురం నుంచి గోరంట్లకు వచ్చి చౌడేశ్వరి కాలనీలో అద్దె ఇంటిలో ఉంటూ మగ్గం నడిపేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం లక్ష్మి జాకెట్లు కుట్టించుకోవడానికి టైలర్‌ వద్దకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో లింగమూర్తి గోరంట్ల పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీ్‌సస్టేషన నుంచి ఇంటికి వెళ్లగా అప్పటికే భార్య ఉమాదేవి పైకప్పునకు మగ్గం సిల్కుతాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్లిందని తీవ్ర మనస్తాపం చెందిన అఘాయిత్యానికి పాల్పడింది. సీఐ ఘటనా స్థలాన్ని సందర్శించి, శవాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. రెండు కేసులు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - 2022-05-28T06:24:20+05:30 IST