ఆసుపత్రిలో అవస్థలు

ABN , First Publish Date - 2022-07-06T06:33:25+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగుల బాధలు ఎవరికి పట్టడం లేదు. పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి. ఇక్కడ వసతులు పెరిగినా రోగులకు తిప్పలు మాత్రం తప్పడం లేదు.

ఆసుపత్రిలో అవస్థలు
సె్ట్రచర్స్‌లో యువకుడిని తీసుకెళ్తున్న మహిళలు

  ఎంఎనఓలు ఉన్నా కనిపించరు

నడవలేక రోగుల పాట్లు

బంధువులే వీల్‌చైర్‌లో తీసుకెళ్లాలి

సర్వజన ఆస్పత్రిలో అదే నిర్లక్ష్యం

అనంతపురం టౌన జూలై 5 : జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగుల బాధలు ఎవరికి పట్టడం లేదు. పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి. ఇక్కడ వసతులు పెరిగినా రోగులకు తిప్పలు మాత్రం తప్పడం లేదు. నడవలేని స్థితిలో రోగులు వస్తే వారి బాధలు ఇక చెప్పనక్కర్లేదు. అలాంటి వారు ఆస్పత్రికి వస్తే ఓపీ, ఎమర్జెన్సీ విభాగాల్లోకి వీల్‌చైర్లు, సె్ట్రచర్స్‌లో తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఎం ఎనఓ, ఎఫ్‌ఎనఓలను ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది వరకు ఉన్నారు. కానీ వారు ఎక్కడా కనిపించడం లేదు. నడ వలేనివారు అవస్థలు పడుతూ ఇతరుల సహాయంతో వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారు. మరికొంతమంది రోగులను వీల్‌చైర్‌, సె్ట్రచర్లలో బంధువులే కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు.  మంగళవారం ఒక వ్యక్తి కాలు పాదం దెబ్బతింది. నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు పట్టించుకొనే వారు లేరు. దీంతో మరో వ్యక్తి భుజంపై చేయివేసుకొని కుంటుకుంటూ ఆర్థో విభా గానికి వెళ్లాడు.  అలాగే కాళ్లు దెబ్బతిన్న ఒక కుర్రోడిని చికిత్స కోసం ఇద్దరు మహిళలు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారిని ఎవరు పట్టించుకోలేదు. దీంతో వారే  సె్ట్రచర్‌ తెచ్చుకొని ఆ యువకుడిని కూర్చోబెట్టుకొని చికిత్స కోసం ఆర్థో విభాగానికి తీసుకెళ్లారు. ఇలాంటి దృశ్యాలు ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. అయినా కరుణించే వారే కరువయ్యారు. ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు ఆదా యాలకు అలవాటు పడ్డారు. పైసలిస్తేనే తీసుకెళ్తున్నారు. మరోవైపు ఏ విభాగంలో ఆదాయం ఉంటే అక్కడే ఉండిపోతున్నారు. దీనికి కారణం పర్యవేక్షణాధికారులు పట్టించుకోకపోవడమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని విభాగాల్లో  వీరిదే హవా. డాక్టర్లు, నర్సులు సైతం వారు చెప్పినట్లే వింటారన్న ప్రచారం ముందునుంచి ఉంది. దీన్నిబట్టి ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు వ్యవహా రం ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది.   దీంతో రోగులకు బాధలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకు లు ఈ సమస్యను పరిష్కరించే  దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.



Updated Date - 2022-07-06T06:33:25+05:30 IST