క్యాన్సర్ కణాలను పట్టేశాడు
ABN , First Publish Date - 2022-08-14T06:10:45+05:30 IST
క్యాన్సర్ మహమ్మారిని తొలిదశలోనే గుర్తించే పరిశోధనకు ఎస్కేయూ వేదికైంది. బయోటెక్నాలజీ పరిశోధక విద్యార్థి సత్యనారాయణస్వామి ఈ దిశగా విజయం సాధించారు.

తొలిదశలోనే గుర్తించే ప్రాజెక్ట్ విజయవంతం..
ఎస్కేయూ పరిశోధక విద్యార్థి సత్యనారాయణ ఘనత..
పేటెంట్ హక్కు కల్పించిన జర్మనీ
అనంతపురం సెంట్రల్, ఆగస్టు 13:
క్యాన్సర్ మహమ్మారిని తొలిదశలోనే గుర్తించే పరిశోధనకు ఎస్కేయూ వేదికైంది. బయోటెక్నాలజీ పరిశోధక విద్యార్థి సత్యనారాయణస్వామి ఈ దిశగా విజయం సాధించారు. ‘సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన ఆఫ్ క్లియర్ ఇనఫ్రారెడ్ నిఖేల్డోప్డ్ సీడీఎ్‌సఈ క్వాంటమ్ డాట్ ఫర్ ఐసొలేషన అండ్ ఇమేజింగ్ ఆఫ్ రేర్ క్యాన్సర్ సెల్స్’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. కల్చర్ ప్రక్రియద్వారా మానవ శరీరంలోని క్యాన్సర్ కణాలను ఆదిలోనే గుర్తించేందుకు సత్యనారాయణస్వామి చేసిన పరిశోధన విజయవంతమైంది. తన పరిశోధనకు ‘క్లియర్ ఇనఫ్రారెడ్ క్వాంటమ్ డాట్ ఫర్ సెల్యులార్ ఇమేజింగ్ అండ్ షార్టింగ్’ అనే టైటిల్‌తో జర్మనీ పేటెంట్ రైట్స్ ఇచ్చింది. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని సత్యనారాయణస్వామి అంటున్నాడు.
మొదట్లోనే గుర్తించేలా..
క్యాన్సర్‌లో దాదాపు 27 వేల రకాలు ఉన్నాయి. మానవ శరీరంలోని క్యాన్సర్ కణాలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు గుర్తించేందుకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎలాంటి పరిజ్ఞానం లేదు. ఒకటి, రెండు స్థాయిల్లో క్యాన్సర్‌ను గుర్తించలేక ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శరీరంలో అవయవాలను పాడుచేసే సమయం అంటే.. మూడో స్థాయిలో మాత్రమే క్యాన్సర్ కణాలు బయటపడుతున్నాయి. ఈ స్థాయిలో వ్యాధిని నియంత్రించడం ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మొదటి దశలోనే క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు సత్యనారాయణస్వామి పరిశోధన చేశారు.
మొదట్లోనే గుర్తించేలా..
క్యాన్సర్‌లో దాదాపు 27 వేల రకాలు ఉన్నాయి. మానవ శరీరంలోని క్యాన్సర్ కణాలు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు గుర్తించేందుకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎలాంటి పరిజ్ఞానం లేదు. ఒకటి, రెండు స్థాయిల్లో క్యాన్సర్‌ను గుర్తించలేక ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శరీరంలో అవయవాలను పాడుచేసే సమయం అంటే.. మూడో స్థాయిలో మాత్రమే క్యాన్సర్ కణాలు బయటపడుతున్నాయి. ఈ స్థాయిలో వ్యాధిని నియంత్రించడం ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మొదటి దశలోనే క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు సత్యనారాయణస్వామి పరిశోధన చేశారు.
పరిశోధనలో భాగమైనవారు
సత్యనారాయణస్వామి పరిశోధనకు అనేకమంది సహాయ సహకారాలందించారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ మురళీధర్‌రావు సూపర్ వైజర్‌గా వ్యవహరించారు. ఇదేవిభాగం విద్యార్థులు గాయత్రి, చరిష్మా, తేజ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్‌గా సైంటిఫిక్ రిపోర్ట్ రాయడం, రసాయనాలు అందించడం వంటి సేవలు అందించారు. దిలీ్‌పకుమార్ స్టాటిస్టిక్స్ అనాలసిస్ చేశారు. హైదరాబాదు ఉస్మానియా సెల్ కల్చర్ విభాగం ప్రొఫెసర్ రోజారాణి ల్యాబ్స్ సౌకర్యాన్ని కల్పించారు. పరిశోధనకు అవసరమైన రసాయనాలను అందజేశారు. ప్రొఫెసర్ రోజారాణి విద్యార్థులు జనటిక్స్ పరిశోధకులు స్వాతి, శివప్రసాద్ సెల్‌కల్చర్ ప్రయోగానికి సాయపడ్డారు. మధురై అశా సైన్స కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేష్ పాండియన ఆర్థిక వనరులను సమకూర్చారు. వీరందరి సహకారంతో సత్యనారాయణస్వామి తన పరిశోధనను దిగ్విజయంగా పూర్తిచేసి పేటెంట్ హక్కులను పొందారు.
అందరి సాయంతో..
ఐసీఎంఆర్, ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్ట్ ఇనచార్జ్(పీఐ)గా పనిచేస్తున్నాను. తొమ్మిదిమంది సాయంతో ఐసీఎంఆర్ కింద సొంతంగా ‘సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన ఆఫ్ క్లియర్ ఇనఫ్రారెడ్ నిఖేల్డోప్డ్ సీడీఎ్‌సఈ క్వాంటమ్ డాట్ ఫర్ ఐసొలేషన అండ్ ఇమేజింగ్ ఆఫ్ రేర్ క్యాన్సర్ సెల్స్’ అనే కొత్త ప్రొజెక్ట్ చేశాను. సింథసిస్ కోసం ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ రోజారాణి సహకరించారు. బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్మెటీరియల్స్(సీఈఎనఎ్స), ఎస్ఏఐఎఫ్ ఐఐటీ మద్రా్‌సలో క్యారెక్టరైజేషన పనులు చేశాను. సర్టిఫైడ్ ల్యాబ్‌లో దొరికే ఇమ్మోర్టల్ సెల్స్‌ను ఉపయోగించి చేసిన పరిశోధన ఇది. దీన్ని మమేలియన సెల్‌కల్చర్ అంటాము. రోగి నుంచి రక్తాన్ని సేకరిస్తే మెడికల్ అవుతుంది. ఇందుకు ఎథికల్ కమిటీ ఉండాలి. క్వాంటమ్ డాట్‌ను తయారుచేసి క్యాటరైజేషన ద్వారా క్యాన్సర్ కణాలను క్యాప్చర్చేసి ఇమేజ్ను గుర్తించాను. అనంతరం జర్మన పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాను. ప్రాజెక్ట్‌కు సంబంధించి పది సంవత్సరాలపాటు హక్కులను కల్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.3 లక్షలు ఖర్చుచేశాను. ఇందుకు ప్రొఫెసర్ రోజారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేష్ పాండియన సహాయమందించారు. పబ్లికేషన్సకు తేజ, క్యాటరైజేషనకు మిత్రులు సహాయపడ్డారు. ఇలా అందరి సహాయంతో ప్రాజెక్ట్‌ను దిగ్విజయంగా పూర్తిచేశాను. క్లినికల్ రీసర్చ్ చేయడానికి మేజర్ ప్రాజెక్ట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సివుంది. ఇందుకు కనీసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు అంత ఆర్థిక స్థోమతలేదు. ప్రభుత్వం, అధికారులు సాయం చేస్తే మొదటి స్థాయిలోనే క్యాన్సర్ కణాలను గుర్తించి, బాధితులను కాపాడుకోవచ్చు.
- సత్యనారాయణ

పరిశోధనలను ప్రోత్సహిస్తాం..
మానవాళిని కబళిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని ఆదిలోనే గుర్తించేందుకు వర్సిటీలో పరిశోధన చేయడం హర్షణీయం. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన పరిశోధక విద్యార్థి సత్యనారాయణస్వామి వర్సిటీ ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. ఇలాంటి పరిశోధనలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తాం. సత్యనారాయణ ప్రాజెక్ట్ క్లినికల్ స్టడీ చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం.
- ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ఎస్కేయూ వీసీ
ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టం
క్యాన్సర్ కణాలను ఆదిలోనే గుర్తించేందుకు చేసిన పరిశోధన ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో నూతన పరిశోధనలు చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఏ ప్రాజెక్ట్‌లోనైనా అసిస్టెంట్‌గా పనిచేయాలంటే అనుభవం చాలా అవసరం. విద్యార్థి దశలోనే పరిశోధనల్లో పాలుపంచుకోవడం వర్శిటీ నాకిచ్చిన వరం.
- చరిష్మా, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ