వైసీపీకి నూకలు చెల్లాయ్‌ : టీడీపీ

ABN , First Publish Date - 2022-09-30T06:17:35+05:30 IST

వైసీపీ దౌర్జన్య కాండ ఎన్నాళ్లో సాగదని, ఆపార్టీకి నూకలు చల్లాయని టీడీపీ నాయకులు విమర్శిం చారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఆపార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు.

వైసీపీకి నూకలు చెల్లాయ్‌ : టీడీపీ
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

హిందూపురం, సెప్టెంబరు 29: వైసీపీ దౌర్జన్య కాండ ఎన్నాళ్లో సాగదని, ఆపార్టీకి నూకలు చల్లాయని టీడీపీ నాయకులు విమర్శిం చారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఆపార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. మేముకూడా మీలాగే రోడ్డుపైకి వస్తే వై సీపీ నాయకులు హిందూపురంలో తిరగలేరని హెచ్చరించారు. గత ఐదేళ్లలో మేము తలుచుకుని ఉంటే మీరెక్కడ ఉండేవారో గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, వైసీపీ దాడులను తిప్పి కొడతామన్నారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. రామాంజినమ్మపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై హిజ్రాలతో ఫిర్యాదు చే యించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దేశంలోనే హిజ్రాలకు పెన్షన ఇవ్వడం ప్రారంభించింది టీడీపీ అన్నారు. ప్రజాస్వామ్యపద్ధతిలో విలేకరుల సమావేశం ముగించుకుని బయటికి వ స్తున్న సమయంలో వైసీపీ నాయకులు గూండాల్లా చుట్టుముట్టి దళి త మహిళపై దాడిచేయడం హేయమైన చర్య అన్నారు. సమావేశం లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, ఆర్‌ఎంఎస్‌ ష ఫీ, అంబికా లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్‌, నాగరాజు, రమేష్‌, చం ద్ర మోహన పాల్గొన్నారు. 


Read more