అదరగొట్టిన హరిప్రియ

ABN , First Publish Date - 2022-10-13T05:51:57+05:30 IST

జేఎనటీయూ విద్యార్థిని హరిప్రియ రూ.45 లక్షల వార్షిక వేతన ఉద్యోగానికి ఎంపికైంది.

అదరగొట్టిన హరిప్రియ
విద్యార్థిని అభినందిస్తున్న వీసీ

అమెజానలో  రూ.45 లక్షల ఉద్యోగం

అనంతపురం సెంట్రల్‌, అక్టోబరు 12: జేఎనటీయూ విద్యార్థిని  హరిప్రియ రూ.45 లక్షల వార్షిక వేతన ఉద్యోగానికి ఎంపికైంది. ఈ ఏడాది బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన హరిప్రియ, ఈ-కామర్స్‌ సంస్థ అమెజానలో ఉద్యోగం సాధించింది. ఆమెను వీసీ రంగజనార్దన బుధవారం అభినందించారు. జేఎనటీయూ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థి ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వీసీ తెలిపారు. అత్యధిక వార్షిక వేతనాలు పొందుతూ.. వర్సిటీ ఖ్యాతిని తమ విద్యార్థులు పెంచుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ వీసీ, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ సుదర్శన రావు, ప్రిన్సిపాల్‌ సుజాత, హెచఓడీ మాధవి, ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వసుంధర, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-13T05:51:57+05:30 IST