ఘనంగా మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-17T05:34:39+05:30 IST

మండలంలోని నాగలూరు, పోతులనాగేపల్లి, వెంకటతిమ్మాపురం గ్రామాల్లో మొహర్రం వేడుకల్లో భాగంగా మంగళ వారం పీర్లను జలధికి తరలించారు.

ఘనంగా మొహర్రం వేడుకలు
నాగలూరులో అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్న పీర్లు

ధర్మవరంరూరల్‌, ఆగస్టు16: మండలంలోని నాగలూరు, పోతులనాగేపల్లి, వెంకటతిమ్మాపురం గ్రామాల్లో మొహర్రం వేడుకల్లో భాగంగా మంగళ వారం పీర్లను జలధికి తరలించారు. తెల్లవారు జామున, మధ్యాహ్నం ఆయా గ్రామాల్లో పీర్ల  ఊరే గింపు నిర్వహించారు. ఆయా గ్రామస్థులు పెద్దఎత్తున  పీర్ల మకానల వద్దకు చేరుకుని చక్కెర చదివింపులు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అగ్నిగుండం పూడ్చివేశారు.  యువకులు, పెద్దలు, మహిళలు అలావ్‌ తొక్కుతూ సందడిచేశారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

తాడమర్రి: మండల కేంద్రంలో చిన్నపీర్లపండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పీర్లను అలంకరించి గ్రామంలో ఊరేగించారు. సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం చేయించిన అనంతరం జలధి కార్యక్రమం చేపట్టారు.  భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

Read more