పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-03T06:33:08+05:30 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదును వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి తెలిపారు.

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి
ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్న తిప్పేస్వామి

మడకశిరటౌన, అక్టోబరు 2: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదును వేగవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం పట్టణంలో ప ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై పార్టీ శ్రేణులకు అవగాహ న కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్ర జా వ్యతిరేక విధానాలను పట్టభద్రులకు వివరించాలన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాల్‌రెడ్డికి ఓటు వేయించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు భ క్తర్‌, జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి నాగరాజు, పట్టణ అధ్యక్షులు మనోహర్‌, ప్రధాన కార్యదర్శి కన్నా, టీఎనఎ్‌సఎ్‌ఫ మురళీ పాల్గొన్నారు.  


Read more