పాడి రైతులకు ఉచిత ప్రమాద బీమా

ABN , First Publish Date - 2022-10-05T04:05:12+05:30 IST

హెరిటేజ్‌కు పాలు విక్రయించే పాడి రైతులకు ఉచిత ప్రమాద బీమా చేయించనున్నట్లు హెరిటేజ్‌ ఏరియా మేనేజర్‌ ఆదినారాయణ, ప్లాంట్‌ మేనేజర్‌ శంకరయ్య తెలిపారు.

పాడి రైతులకు ఉచిత ప్రమాద బీమా
చెక్కు అందజేస్తున్న దృశ్యం

హెరిటేజ్‌ ఏరియా మేనేజర్‌ ఆదినారాయణ


హిందూపురం, అక్టోబరు 4: హెరిటేజ్‌కు పాలు విక్రయించే పాడి రైతులకు ఉచిత ప్రమాద బీమా చేయించనున్నట్లు హెరిటేజ్‌ ఏరియా మేనేజర్‌ ఆదినారాయణ, ప్లాంట్‌ మేనేజర్‌ శంకరయ్య తెలిపారు. మంగళవారం లేపాక్షి మండలం తిమ్మగానిపల్లి, మడకశిర మండలం గంతపల్లిలోని హెరిటేజ్‌ పాలసేకరణ కేంద్రంలో ఉత్పత్తి దారులకు 2022-23 సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక బోన్‌సను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పాడిరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హెరిటేజ్‌ ప్రథమ ఉద్దేశమన్నారు. పాడిరైతులకు ఉచితంగా బీమా సౌకర్యం ఉంటుందన్నారు. అదేవిధంగా పశువులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నా రు. పది గ్రామాలకు చెందిన పాడి రైతులకు రూ.2,64,421 బోనస్‌ అందజేసినట్లు తె లిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రాజశేఖర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 


Read more