ఫుట్‌బాల్‌ లీగ్‌ విజేత కదిరి

ABN , First Publish Date - 2022-12-16T23:51:28+05:30 IST

ఉమ్మడి జిల్లా ఫుట్‌ బాల్‌ లీగ్‌ విజేతగా కదిరి నిలిచింది. 9వ అనంతపూర్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ అండర్‌-18 ఫైనల్‌ పోటీలు శుక్రవారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించారు. మొత్తం 11 జట్లు పాల్గొనగా పాయింట్ల ఆధారంగా కదిరి విజేతగా, హిందూపురం ద్వితీయ స్థానం, కొత్తచెరువు తృతీయ స్థానం, గుత్తిటౌన నాలుగో స్థానంలో నిలిచాయి.

ఫుట్‌బాల్‌ లీగ్‌ విజేత కదిరి
విజేత కదిరి జట్టు

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు16: ఉమ్మడి జిల్లా ఫుట్‌ బాల్‌ లీగ్‌ విజేతగా కదిరి నిలిచింది. 9వ అనంతపూర్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ అండర్‌-18 ఫైనల్‌ పోటీలు శుక్రవారం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించారు. మొత్తం 11 జట్లు పాల్గొనగా పాయింట్ల ఆధారంగా కదిరి విజేతగా, హిందూపురం ద్వితీయ స్థానం, కొత్తచెరువు తృతీయ స్థానం, గుత్తిటౌన నాలుగో స్థానంలో నిలిచాయి. అనంత క్రీడాగ్రామం మేనేజర్‌ వంశీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ కోఆర్డినేటర్‌ కిశోర్‌బాబు, కోచలు ఇర్షాద్‌, గిరినాథ్‌, రెడ్డప్ప, జయకుమార్‌, హేమవర్ధన, సలీం, రవికుమార్‌, చంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:51:29+05:30 IST