వందేళ్లలో తొలిసారి..

ABN , First Publish Date - 2022-12-15T00:21:11+05:30 IST

వందేళ్ల చరిత్ర కల్గిన ఆర్ట్స్‌ కళాశాల లక్షలాదిమంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విద్యాలయంగా కీర్తి గడించింది. ఇక్కడ చదివిన ఎంతో మంది అత్యున్నత స్థానాలను అధిరోహించారు.

వందేళ్లలో తొలిసారి..

17న ఆర్ట్స్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన వేడుకలు

దేశానికి మేధావులను అందించిన కళాశాలగా గుర్తింపు

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 14: వందేళ్ల చరిత్ర కల్గిన ఆర్ట్స్‌ కళాశాల లక్షలాదిమంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విద్యాలయంగా కీర్తి గడించింది. ఇక్కడ చదివిన ఎంతో మంది అత్యున్నత స్థానాలను అధిరోహించారు. తొలుత సాధారణ కళాశాలగా ఏర్పాటైన ఈ కళాశాల ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి విద్యాసంస్థగా విరాజిల్లుతోంది. దాదాపు 200మంది అధ్యాపకులు, 5వేలమంది విద్యార్థులతో రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. యూనివర్సిటీ వాతావరణంలో బోధనావిధానాలను అవలంభిస్తుండటంతో ఈ ఏడాది 1050మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన యూఆర్‌రావు, ఐపీఎ్‌సలు పుల్లన్న, ఏకే ఖాన, పద్మశ్రీ డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావులాంటి ఎందరో ప్రముఖులు ఈ విద్యావనంలోని పుష్పాలే. ఇంకా ఎంతో మంది ఐఏఎ్‌సలు, గ్రూప్‌ వన ఆఫీసర్లు, రాజకీయవేత్తలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఇలా సమాజంలోని అన్ని రంగాల్లో ప్రముఖులుగా గుర్తించబడుతున్న అనేకమంది ఈ చదువులమ్మ ఒడిలో ఆడిన బిడ్డలే. ఈ ప్రయాణంలో తొలిసారిగా ఈనెల 17న గ్రాడ్యుయేషన పండుగను నిర్వహించనున్నారు. ఈ వేడుకలో కాలేజియేట్‌ ఎడ్యుకేషన కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ ఐఏఎస్‌, అకడమిక్‌ గైడెన్స ఆఫీసర్‌ తులసి, స్వయంప్రతిపత్తి కళాశాలల అకడమిక్‌ ఆఫీసర్‌ రవికిరణ్‌, ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, రెక్టార్‌ మల్లికార్జునరెడ్డి, రిజిస్ర్టార్‌ ఎంవీ లక్ష్మయ్య విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు.

Updated Date - 2022-12-15T00:21:12+05:30 IST