జగన అరాచకాలపై పోరాటం

ABN , First Publish Date - 2022-12-31T00:13:34+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన అరాచ కాలపై పోరాటం చేస్తామని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.

జగన అరాచకాలపై పోరాటం

అనంతపురం విద్య, డిసెంబరు 30: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన అరాచ కాలపై పోరాటం చేస్తామని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశా నికి ముందు కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూ రాలని మౌనం పాటించారు. తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సీఎం అరాచకాలు, అక్రమాలు, దౌర్జ న్యాలతో కొనసాగుతోందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులను సైతం అణచి వేస్తున్నారంటూ మండిపడ్డారు. చలో విజయవాడ, చలో అసెంబ్లీ, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చేపట్టిన పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా నాయ కులను అరెస్టు చేయించి అడ్డుకోవడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శిజాఫర్‌ మాట్లాడుతూ... కేంద్రంలో మతోన్మాదంతో పాలనసాగిస్తున్న బీజేపీ, నియంతృ త్వ పోకడల జగన ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించడానికి జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ బస్సుయాత్ర చేపట్టను న్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి, మల్లికార్జున, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, జిల్లా కార్యదర్శి సభ్యులు శ్రీరాములు, లింగమయ్య, రమణ, ఇతర నాయుకులు రాజేష్‌ గౌడ్‌, సంతోష్‌కుమార్‌, చిరంజీవి, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:13:36+05:30 IST