జీతాలో జగనన్నా..!

ABN , First Publish Date - 2022-12-12T23:38:21+05:30 IST

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎ ప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా రు. తమకు అందాల్సిన ప్రయోజనాల కోసం పోరాడటం సంగతి దేవుడెరుగు.. జీతాలు పడితే చాలన్న దుస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వోద్యోగులకు వ్యవస్థ ఏర్పాటైనప్పట్నుంచి ఒకటో తేదీ రాగానే జీతం పడిపోతుందంతే.

జీతాలో జగనన్నా..!

12వ తేదీ దాటినా అందని వేతనాలు

నెలవారీ ఖర్చులకు ఉద్యోగుల ఇబ్బందులు

ప్రభుత్వం తీరుపై మండిపాటు

రోడ్డెక్కుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

ధర్మవరం

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎ ప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా రు. తమకు అందాల్సిన ప్రయోజనాల కోసం పోరాడటం సంగతి దేవుడెరుగు.. జీతాలు పడితే చాలన్న దుస్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వోద్యోగులకు వ్యవస్థ ఏర్పాటైనప్పట్నుంచి ఒకటో తేదీ రాగానే జీతం పడిపోతుందంతే. జీతం గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. సందేహించిన సమయం లేదు. వైసీపీ అధికారం చేపట్టినప్పట్నుంచి సీన రివర్స్‌ అయింది. జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని దుస్థితి. నెలాఖరులో కూడా పడుతున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ రాగానే పాలవాళ్లకు కూడా జీతం పడలేదని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నామని ఆ వర్గాలు వాపోతున్నాయి. వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు రుణాల కంతులు, పిల్లల పాఠశాల ఫీజులకు నానా అవస్థలు పడుతున్నారు.

12 రోజులైనా..

ఉమ్మడి జిల్లాలో 19,928 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా ఒకటో తేదీ వస్తుందంటే జీతం అందుతుందనే ఆనందం ఉండేది. ప్రస్తుతం జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. డిసెంబరు నెల 12 రోజులు దాటుతున్నా ఉపాధ్యాయులకు జీతం పడలేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో అన్నింటికీ ఇబ్బందులు పడుతున్నారు.

మందులకూ ఇబ్బంది..

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల్లో చాలామంది అనారోగ్య బాధితులు ఉంటారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును పెంచడంతో 60 ఏళ్ల వయసువారు చాలా మందికి ఆరోగ్య సమస్యలుంటాయి. పనిఒత్తిడి కూడా ఇందుకు కారణం. పెన్షనర్లలో దాదాపు అందరికీ ఆరోగ్య సమస్యలుంటాయి. నెలనెలా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. నెలలో సగం రోజులు గడుస్తున్నా.. జీతం మాత్రం అందలేదు. వైద్య ఖర్చులకు వారు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ అనగానే.. పాలవాళ్లు, పలురకాల వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఇంటికి నిత్యావసరాలు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఇబ్బందే. కొందరు ఉద్యోగులైతే పాలవారికి కూడా జీతాలు పడలేదని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.

కంతులు కట్టలేక..

చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు.. బ్యాంకు లోన్లు తీసుకుని ఉండుంటారు. వాహనాలు, గృహ రుణాలు అందులో ఉంటాయి. వాటి కంతులు ప్రతినెలా ఐదో తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. 12వ తేదీ దాటినా వేతనం పడకపోవడంతో బ్యాంకు కంతులు చెల్లించలేకపోతున్నారు. దీంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. అంతేనా, ఆలస్యపు చెల్లింపులకు బ్యాంకులు డీఫాల్టరుగా కూడా పరిగణించే ప్రమాదం లేకపోలేదు. దీంతో తమకేంటి ఈ తిప్పలు అంటూ వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు అందించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.

జీతాలు కూడా ఇవ్వలేరా..?

సంక్షేమ పథకాల పేరుతో వేలకోట్ల రూపాయలు బటన నొక్కి, నిధులు విడుదల చేస్తున్న సీఎం జగన.. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు ఇవ్వలేరా? నిజంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే సంక్షేమ పథకాల పేరుతో బటన నొక్కుడు ఎందుకు?ఉపాధ్యాయ, ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమే. చరిత్రలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నాం. చలో విజయవాడ అనంతరం ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్ష కట్టింది.

- శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రజలు.. ఉద్యోగులు వేర్వేరు కాదు..

ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆ తరువాతే ఉద్యోగు లు అని మంత్రి బొత్స సత్యనారాయణ అనడం సరికాదు. ప్రజల్లో భాగమే ఉద్యోగులు అన్న విషయం మరువరాదు. ఆలస్యంగా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం ఆంధ్రప్రదేశలోనే జరుగుతోంది. ప్రభుత్వం.. ఉద్యోగులపై కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. 1వ తేదీన జీతాలు అందేలా చూడాలి.

- బీకే ముత్యాలప్ప, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌

అలసత్వం ఎందుకు?

ప్రతి ఉద్యోగీ నెలంతా పనిచేసి, 1వ తేదీ జీతం కో సం ఎదురు చూస్తాడు. ఈ నెలలో సగం రోజులు గ డిచిపోయినా నేటికీ జీతాలు జమ కాకపోవడం ఏం టి? రుణాలకు కంతులు కట్టలేక అపరాధ రుసుం చె ల్లించాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నాం. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన అందక కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు

- హరిప్రసాద్‌ రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - 2022-12-12T23:38:25+05:30 IST