జీతాలిస్తారా... చావమంటారా...!
ABN , First Publish Date - 2022-01-13T05:58:30+05:30 IST
‘కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. అయినా ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆరు నెలల జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇక మేమెలా బతకాలి? జీతాలిస్తారా... ఈ పురుగుల మందు తాగి చావమంటారా..’ అంటూ కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది.. అధికారులను ప్రశ్నించారు.
పురుగుల మందు డబ్బాలతో కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది నిరసన
జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద టెన్షన
అనంతపురం వైద్యం, జనవరి 12: ‘కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. అయినా ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆరు నెలల జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇక మేమెలా బతకాలి? జీతాలిస్తారా... ఈ పురుగుల మందు తాగి చావమంటారా..’ అంటూ కొవిడ్ కాంట్రాక్టు సిబ్బంది.. అధికారులను ప్రశ్నించారు. కొవిడ్ కేంద్రాల్లో బాధితులకు సేవలందించేందుకు తాత్కాలిక విధానంలో జిల్లాలో దాదాపు 1200 మందిని నియమించుకున్నారు. దాదాపు 10 నెలలు వీరు పనిచేశారు. కొవిడ్ కేసులు తగ్గడంతో వీరందరినీ తొలగించారు. ఆరు నెలల వేతనాలు.. దాదాపు రూ.12 కోట్లకు పైగానే పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్, జేసీలు, ఆర్డీఓలు, డీఎంహెచఓ, సూపరింటెండెంట్, డీసీహెచఎ్‌స కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం వారు జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. దీంతో డీఎంహెచఓ ఆఫీసు వద్ద రెండు గంటలపాటు టెన్షన నెలకొంది. ఇనచార్జి డీఎంహెచఓ డాక్టర్ రామసుబ్బారావు.. వారితో చర్చించారు. విషయాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కొవిడ్ వారియర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, కోశాధికారి కుళ్లాయప్ప, నేతలు బాబావలి, ప్రవీణ్, లక్ష్మిప్రసాద్, సుకన్య, అరుణాదేవి, హుసేనబీ పాల్గొన్నారు.