విద్యుత సబ్‌స్టేషన ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-12-24T23:29:40+05:30 IST
తమ గ్రామానికి మంజూరైన విద్యుత సబ్‌స్టేషనను అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గిన విద్యుత అధికారులు మరో చోటకు సబ్‌స్టేషన తరలిస్తున్నారంటూ చోళసముద్రం రైతులు నిరసనకు దిగారు.
చోళసముద్రంలో రైతుల నిరసన
కూడేరు, డిసెంబరు 24: తమ గ్రామానికి మంజూరైన విద్యుత సబ్‌స్టేషనను అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గిన విద్యుత అధికారులు మరో చోటకు సబ్‌స్టేషన తరలిస్తున్నారంటూ చోళసముద్రం రైతులు నిరసనకు దిగారు. శనివారం విద్యుతశాఖ ఉన్నతాధికారులు పి.నారాయణపురం గ్రామంలో సబ్‌స్టేషన ఏర్పాటుకు స్థల పరిశీలనకు వెళ్ళారు. విషయం తెలుసుకున్న చోళసముద్రం రైతులు గ్రామంలోనే నిరసన చేపట్టారు. గతంలో చోళసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని వ్యవసాయ తోటలకు విద్యుత సమస్యతో పంటలు ఎండిపోతుండటంతో పలుమారు సబ్‌స్టేషన ఎదుట రైతులు నిరసనకు దిగారు. విద్యుత సమస్యను మండల విద్యుత అధికారులు ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చోళసముద్రం గ్రామంలోనే విద్యుత సబ్‌స్టేషన ఏర్పాటుకు సిద్దం చేశారు. సబ్‌స్టేషన ఏర్పాటుకు అవసరమైన భూమిని స్థానిక రైతు ఆదినారాయణ ఉచితంగా ఇవ్వడంతో స్దల పరిశీలించి అధికారులు నిర్మాణంకు అనువుగా ఉన్నట్లు చెప్పిన అధికారులు ప్రస్తుతం రాజకీయ జోక్యంతో మరోగ్రామానికి తరలిస్తున్నారని రైతులు మండిపడ్డారు. తమ గ్రామంలోనే సబ్‌స్టేషన ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని రైతులు తెలిపారు. సబ్‌స్టేషన ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించినా విద్యుత అధికారులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఈవిషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.