దసరా సంబరం

ABN , First Publish Date - 2022-10-07T05:43:09+05:30 IST

శరన్నవరాత్రి వేడుకలు ముగిశాయి. దసరా పండుగను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు.

దసరా సంబరం
బుక్కరాయసముద్రం చెరువులో కొండమీదరాయుడి తెప్పోత్సవం

అనంతపురం కల్చరల్‌/బుక్కరాయసముద్రం అక్టోబరు 6: 

శరన్నవరాత్రి వేడుకలు ముగిశాయి. దసరా పండుగను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయాలలో విజయదశమి  రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతపురంలోని పాతూరు, కొత్తూరు అమ్మవారిశాలల్లో గురువారం సాయంత్రం శయనోత్సవంతో వేడుకలను ముగించారు. బుక్కరాయసముద్రం సమీపంలోని కొండమీదరాయుడికి బుధవారం తెప్పోత్సవం నిర్వహించారు. మత్స్యకార సంఘం అధ్వర్యంలో బుక్కరాయసముద్రం చెరువులో ఈ వేడుక జరిపించారు.  పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సంబరాలలో పాలుపంచుకున్నారు. 


 


Read more