చెరువు నీటిలో మునిగిన తాగునీటి బోర్లు
ABN , First Publish Date - 2022-12-16T23:51:24+05:30 IST
ఊరి చుట్టూ నీరు తొణికి సలాడుతోంది... అయినా జనం గొంతులు తడపలేకపోతున్నాయి. గ్రా మానికి తాగునీటిని సరఫరా చేసే బోర్లుమోటార్లు చెరువు నీటిలో మునిగిపోవడమే సమస్యకు కారణమైంది.
నిలిచిన నీటి సరఫరా
పల్లెల్లో తీరని దాహార్తి
చేతిపంపు బోర్లను ఆశ్రయిస్తున్న జనం
మడకశిర రూరల్, డిసెంబరు 16: ఊరి చుట్టూ నీరు తొణికి సలాడుతోంది... అయినా జనం గొంతులు తడపలేకపోతున్నాయి. గ్రా మానికి తాగునీటిని సరఫరా చేసే బోర్లుమోటార్లు చెరువు నీటిలో మునిగిపోవడమే సమస్యకు కారణమైంది. ఈయేడు కురిసిన భారీ వర్షాలకు మండలవ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లా యి. నీరు పుష్కలంగా ఉన్నా, పలు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించేందు కు అప్పట్లో చెరువుల్లో బోర్లు వేశారు. అక్కడి నుంచి పైప్లైన్లు ఏ ర్పాటు చేసి కాలనీలకు నీరు సరఫరా చేసేవారు. అయితే ఈ యేడు వర్షాలు బాగా రావడంతో మండలంలోని అన్ని చెరువు, కుంటలు నిండాయి. చాలా చెరువుల్లో వేసిన తాగునీటి బోర్లు మునిగిపోయా యి. దీంతో నీరు పుష్కలంగా ఉన్నా, గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. మండలంలో 16 పంచాయతీల్లో దాదాపు 22 చెరువులు ఉన్నాయి. గౌడనహళ్ళి, ఛత్రం, హరేసముద్రం, ఉప్పార్లపల్లి, దొడ్డేప ల్లి, క్యాంపురం, ఎల్లోటి, కల్లుమర్రి, చందకచర్ల, మరువపల్లి, కొత్తలం, ఆమిదాలగొంది, రేకలకుంట, దిగువ ఈచలెడ్డి గ్రామాల్లో తాగునీటి బోర్లు చెరువుల్లో మునిగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గౌడనహళ్ళి చెరువులో బోరు మునిగిపోవడంతో పక్కనే ఉన్న బీసీ కాలనీ వాసులు దూరంగా ఉన్న చేతిపంపు బోరును ఆశ్రయిస్తున్నారు. ఛత్రం చెరువులో రెండు బోర్లు మునిగిపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. సర్పంచు సమీప బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. చెరువుల్లో బోర్లు మున గడంతో విద్యుత స్టార్టర్పెట్టెలు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి.
కొత్త బోర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం..
రంగనాథ్, గ్రామ కార్యదర్శి, గౌడనహళ్ళి
గౌడనహళ్ళి చెరువు పక్కన ఉన్న బీసీ కాలనీలో తాగునీటి ఎద్దడి నెలకుంది. ఉన్న బోరు చెరువు నీటిలో మునిగింది. దీంతో మరో బోరు వేయడానికి రూ.2 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో బోరు వేసి, తాగునీటిని సరఫరా చేస్తాం.