డీపీఓగాప్రభాకర్‌ రావు

ABN , First Publish Date - 2022-03-05T05:35:54+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ప్రభాకర్‌రావును నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

డీపీఓగాప్రభాకర్‌ రావు

ఉత్తర్వులు జారీ

అనంతపురం న్యూటౌన, మార్చి 4: జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ప్రభాకర్‌రావును నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఆ శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కర్నూలు జిల్లా డీఎల్‌పీఓగా పనిచేసిన ప్రభాకర్‌ రావు వెయిటింగ్‌లో ఉన్నారు. జిల్లాకు వెంటనే డీపీఓను నియమించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరడంతో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రభాకర్‌రావు డీపీఓగా బాధ్యతలు చేపడతారని తెలిసింది. గతంలో డీపీఓగా పనిచేసిన పార్వతి ఇక్కడ పోస్టింగ్‌ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు జిల్లాలోని అధికార పార్టీ నేతల సిఫార్సు లేఖలు కూడా తీసుకున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెపై సస్పె న్షన ఎత్తివేస్తే ఇక్కడ డీపీఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వాదన లు వినిపిస్తున్నా యి. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Read more