ధర్మవరంలో నియంతపాలన

ABN , First Publish Date - 2022-12-07T00:03:44+05:30 IST

మూడున్నరేళ్లుగా ధర్మవరంలో ని యంతపాలన సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు.

ధర్మవరంలో నియంతపాలన

చిత్తశుద్ధితో గుడ్‌మార్నింగ్‌ చేసి ఉంటే ప్రజలు సమస్యలు ఎలా చెబుతారు?

ఽధర్మవరంలో చేనేత కార్మికుల ఇబ్బందులు పట్టవా?

ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో పరిటాలశ్రీరామ్‌

ధర్మవరం, డిసెంబరు 6: మూడున్నరేళ్లుగా ధర్మవరంలో ని యంతపాలన సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. పట్టణంలోని సిద్దయ్యగుట్ట, సాయినగర్‌ ప్రాంతా ల్లో మంగళవారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుల్లో ఆయనకు మహిళలు హారతులు పట్టి ఘనస్వా గతం పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునేందుకు కొన్నిప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీచేశారు. అందులో ఎక్కువ శాతం మంది ప్రజలు వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొం టున్నట్టు తెలియజేశారని పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ... వైసీపీతో చేనేతలకు ఒరిగిందేమీ లేదన్నారు. ధర్మవరంలో ఎవరైనా ఆస్తి కొనాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రాబాబును ముఖ్యమంత్రిని చేసుకో వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు మహిళలు సాహెబ్బీ, బీబీ, టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణి కుమార్‌, బోయ రవిచంద్ర, పురుషోత్తంగౌడ్‌, చింతపులుసు పెద్దన్న, రాంపురం శీన, నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లి షరీఫ్‌, అంబటి సనత, క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, గంగారపు రవి, పఠాన బాబుఖాన, చి న్నూరు విజయ్‌చౌదరి, కే హెచ ప్రకాశ, అత్తర్‌ రహీం, చిన్నూరు భాస్కర్‌చౌదరి, టైలర్‌ కుళ్లాయప్ప, కేశగాళ్ల శీన, గిరిక నాగేంద్ర, కరెం టు ఆది, మిడతల యుగంధర్‌ పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: రాబోయే ఎన్నికల్లో జగన భస్తాసుర పాలనను పాతళంలోకి తొక్కేయాలని ఽటీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. ఇదేంఖర్మ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గొట్లూరులో మంగళవారం ఆయన ఇంటింటీకి వెళ్లి సమస్యలను తెలుసు కున్నారు. అనంతరం ఆం జ నేయస్వామి దేవాలయం వద్ద రచ్చ కట్ట కార్య క్రమాన్ని నిర్వహించారు. చాలా మంది ప్రజలు పలు సమస్యలను శ్రీరామ్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్బంగా పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి కేవలం కాలక్షేపం కోసం గుడ్‌ మార్నింగ్‌ పేరుతో తిరుగు తున్నాడని విమర్శించారు. గొట్లూరు - తుమ్మల రోడ్డు దుస్థితే ఎమ్మెల్యే చిత్తశుద్ధి తెలుపుతోందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి కొత్త ప్రచారానికి తెరలేపారని... శ్రీరామ్‌ ఎమ్మెల్యే అయితే మీ పరిస్థితి ఇబ్బం దికరంగా ఉంటుందని సొంతపార్టీ నేతలనే బెదిరిస్తున్నా రని ఆరోపించారు. తాను వైసీపీ నాయకుల జోలికి వెళ్లనని మా కార్య కర్తలు, నాయకులు, ప్రజల జోలికి వస్తే సహించనని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గొట్లూరును అభివృద్ధి పథంలో నడిపి స్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జడ్పీచైర్మన చిగిచెర్లఓబిరెడ్డి, మహేష్‌చౌదరి, కమతంకాటమయ్య, కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి, పోతుకుంట లక్ష్మన్న, గొట్లూరు శ్రీనివాసులు, శివయ్య, అనిల్‌గౌడ్‌, సర్పంచ ముత్యాలప్పనాయుడు, విజయ్‌సారథి, ముచ్చురామి క్రిష్ట, విజయ్‌చౌదరి, అశోక్‌వాల్మీకి, అమరసుధాకర్‌, తొగటఅనిల్‌, సంగాల బాలు, తలారిఈశ్వరయ్య, రజక శ్రీరాములు, గులగాని చిరంజీవి, గరుడం పల్లి చంద్రశేఖర్‌, అంజి, చండ్రాయుడు, రామంజి, బడన్నపల్లిక్రిష్ట, మిడతలయుగంధర్‌, జంగంనరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:03:47+05:30 IST