ధరల పెరుగుదలపై 30న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ABN , First Publish Date - 2022-05-27T05:49:49+05:30 IST

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ ధర్నా తలపెట్టామని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ తెలిపా రు.

ధరల పెరుగుదలపై 30న కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ధర్మవరంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌





ధర్మవరం రూరల్‌, మే 26: పెంచిన ధరలను వెంటనే తగ్గించాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ ధర్నా తలపెట్టామని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌  తెలిపా రు. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆయన గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రరాష్ట్రప్రభుత్వాలు నిత్యవసర సరుకులు, పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచేసి ప్రజలపై పెనుభారం మో పుతున్నాయన్నారు. ఈ ధరలతోపాటు దుస్తులు, చెప్పులపై జీఎస్టీ తగ్గించాలని, స్టీల్‌, సిమెంట్‌, ఇసుక ధరలు, విద్యుత చార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో  కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వాలకు బుద్ధివచ్చేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు జింకాచలపతి, మధు ,కార్యవర్గసభ్యులు, నాయకులు రమణ, వెంకటనారాయణ, వెంకట స్వామి, రవిశంకర, పోతలయ్య, శివ, రాజా తదితరులు పాల్గొన్నారు. 

పోస్టర్లు విడుదల 

తనకల్లు: జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఈ నెల 30న జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తనకల్లులో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం పెంచిన విద్యుత, గ్యాస్‌ ధరలు, బస్సు చార్జీలు తగ్గించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, వంట నూనె ధరలను పెంచి ప్రజలకు నడ్డి విరుస్తున్నారన్నారన్నారు. ఇవి తగ్గించేవరకు పోరాటాలు కొనసాగిసా ్తమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చౌడప్ప, రెడ్డెప్ప, సీపీఎం శివన్న, రమణ, వెంకటరమణ, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు. 

ఓబుళదేవరచెరువు: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ పోరాడాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత చార్జీలు, బస్సు చార్జీలు, డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసారాల ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా,  కేంద్రరాష్ట్ర ప్రభుత్వా లు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 30న కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సీపీఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి అంజి, సీపీఎం మండల కార్యదర్శి అల్లాపల్లి శ్రీనివాసులు, సీపీఐ నాయకులు చలపతినాయుడు, నారాయణస్వామి, హైదర్‌వలి, రత్నాబాయి, రాము, గంగులప్ప, గంగరాజు, దేవేంద్ర, పక్కీరప్ప, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:49:49+05:30 IST