విద్యతోనే అభివృద్ధి సాధ్యం : బీకే

ABN , First Publish Date - 2022-10-05T04:07:35+05:30 IST

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని హిం దూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం కనకదాసు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌, నీట్‌ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యం : బీకే
ప్రతిభా విదార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్న పార్థసారథి

హిందూపురం అర్బన, అక్టోబరు 4: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని హిం దూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం కనకదాసు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌, నీట్‌ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీకే మాట్లాడారు. విద్యతోనే దేశాభి వృద్ధి సాధ్యమని, కురుబ విద్యార్థులు చదువులో ముందుండాలని కోరారు. బా గా చదువుకుని తల్లిదండ్రులు, పుట్టిన ఊరు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రతిభా విద్యార్థులకు పురస్కారాలు అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో కనకదాసు ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప, డిప్యూటీ కలెక్టర్‌ మధులత, ఇంటిలిజెన్స డీఎస్పీ వెంకటరాముడు, ఎంఈఓ గోపాల్‌, బీసీ కమిషన మెంబరు కిష్టప్ప, బోరంపల్లి ఆంజనేయులు, రవీంద్ర, కౌన్సిలర్లు మహేష్‌, శివ, మాజీ కౌన్సిలర్‌ పరిమళ, సంఘం ప్రధాన కార్యదర్శి జనార్ధన, కోశాధికారి శేఖర్‌, కార్యవర్గ సభ్యులు జగదీష్‌, బాలాజీ, సిద్దగంగప్ప, సురేష్‌, తిమ్మయ్య, నాగరాజు, హెల్త్‌ డిపార్టమెంట్‌ నాగరాజు, శ్రీనివాసులు, రాజగోపాల్‌, నాగభూషణం పాల్గొన్నారు. 

Read more