కుంగిన రోడ్డు

ABN , First Publish Date - 2022-10-05T05:08:22+05:30 IST

వేపరాల గ్రామం నుంచి ఆదిగానెపల్లి గ్రామా నికి వెళ్లే రహదారి కుంగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కుంగిన రోడ్డు

రాయదుర్గం, అక్టోబరు 4 : వేపరాల గ్రామం నుంచి ఆదిగానెపల్లి గ్రామా నికి వెళ్లే రహదారి కుంగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు తెగిపో యింది. కాగా వేపరాల గ్రామస్థులు శ్రమదానంతో రాకపోకలు వీలు అయ్యేలా రోడ్డును మరమ్మతులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా రోడ్డుమధ్యలో పెద్ద గుంతపడి కుంగిపోయింది. సుమారు 20 మీటర్ల పొడవులో పూర్తిగా గుంతలు పడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అటు వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రోడ్డు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Read more