కరోనా పడగ

ABN , First Publish Date - 2022-01-22T06:23:26+05:30 IST

కరోనా మహ మ్మారి పడగ విప్పుతోంది.

కరోనా పడగ

24 గంటల్లో 1235 మందికి పాజిటివ్‌

గర్భిణులను వెంటాడుతున్న కరోనా

జిల్లా ఆస్పత్రిలో 24 మంది అడ్మిట్‌

గైనిక్‌ విభాగంలో ఆందోళన

అనంతపురం వైద్యం, జనవరి 21: కరోనా మహ మ్మారి పడగ విప్పుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ రేటు  పెరుగుతుండటం అనంత ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1235 మంది కరోనా బారిన ప డినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు.  జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 163744కి పెరిగింది. ఇందులో 158397 మంది ఆరోగ్యంగా కోలుకోగా 1093 మంది మరణించారని ప్రస్తుతం 4254 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


పల్లెలకు పాకిన వైరస్‌... అనంత నగరం, హిందూపురంలోనే అధికం

జిల్లా వ్యాప్తంగా పల్లెలకు కరోనా వైరస్‌ పాకిపోయింది. అనంత నగరంతో  పాటు అన్ని  మున్సిపాలిటీలు, మండలాల్లోనూ కరోనా దూకుడు చూపుతోంది. శుక్రవారం కూడా  అనంతపురం నగరంలో అత్యధికంగా 361 కేసులు రాగా రెండో స్థానం హిందూపురంలో 119 కేసులు వచ్చాయి. కదిరి 69, పుట్టపర్తి 63, పెనుకొండ 57, గుంతకల్లు 38, అనంతపురం రూరల్‌ 37, తాడిపత్రి 35, పెద్దవడుగూరు 30, సోమందేపల్లి 30, కళ్యాణదుర్గం 28, ధర్మవరం 27, గోరంట్ల 26, లేపాక్షి 21, ముదిగుబ్బ 20, యాడికి 16, బుక్కరాయసముద్రం 15, గుత్తి 15, కొత్త చెరువు 15, చిలమత్తూరు 14, గుదిబండ 13, బత్తలపల్లి 11, కంబదూరు 11, బుక్కపట్నం, రాప్తాడు 9, ఆత్మకూరు, ఓడీసీ, తలుపుల మండలాలలో 8, నార్పల, రొళ్ల, ఉరవ కొండ 7, గాండ్లపెంట, పామిడి, పరిగి 6, బొమ్మనహాళ్‌, కనగానపల్లి, మడకశిర, తనకల్లు 5, బెళుగుప్ప, శింగ నమల 4, చిలమత్తూరు, హీరేహాళ్‌, గార్లదిన్నె, కుందిర్పి, నల్లమాడ, పుట్లూరు మూడేసి కేసులు, కూడేరు, రాయ దుర్గం, శెట్టూరు రెండేసి కేసులు, అమడగూరు, పెద్దపప్పూరు, రామగిరి, రొద్దం, తాడిమర్రి, వజ్రకరూరు మండలాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మిగి లిన కేసులు ఇతర జిల్లాలు, రాషా్ట్రనికి చెందిన వారు ఉన్నారు. 


 24 మంది గర్భిణులకు కరోనా

జిల్లాలో అనేక మంది గర్భిణులు కరోనా బారిన పడ్డా రు. ప్రసవ సమయంలో కరోనా బారిన పడటం వారికి ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేయగా 24 మంది నిండు గర్భిణులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరందరినీ ప్రత్యేక గైనకాలజీ విభాగంలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పురుటి నొప్పులు వస్తే కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు వారికి ప్రసవాలు చేస్తున్నారు. ఆ సమయంలో పిల్లలు కూడా కొందరు కరోనా బారిన పడుతున్నారని, వారికి ప్రత్యేక ఐసీయూ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ జగన్నాథం పేర్కొన్నారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో ప్రస్తు తం 43 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతు న్నారు. ఇందులో గర్భిణులే 24 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 


బడిలో కొవిడ్‌ దడ 

11 మంది విద్యార్థులకు పాజిటివ్‌

సిబ్బందికి కూడా.. నిత్యం పెరుగుతున్న కేసులు

అనంతపురం విద్య, జనవరి 21: పాఠశాలల్లో కొవిడ్‌ దడ పుట్టిస్తోంది. శుక్రవారం పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. విద్యార్థినులతోపాటు, సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నార్పల, ఉరవకొండ, ధర్మవరం, రొళ్ల కేజీబీవీల్లో ఒక్కో విద్యార్థి చొప్పున, బత్తలపల్లిలో వంటమనిషి, స్వీపర్‌కు కొవిడ్‌ సోకినట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌-బెంగళూరు బైపా్‌సలోని ఓ ప్రముఖ స్కూల్‌లో సైతం ఐదుగురు పదో తరగతి విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మారుతీనగర్‌లోని మరో కార్పొరేట్‌ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. ఇలా జిల్లావ్యాప్తంగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది.


ఐటీ సెల్‌లో అన్నీ గోప్యమే..

జిల్లావ్యాప్తంగా నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడుతూనే ఉన్నారు. విద్యాశాఖలోని ఐటీ సెల్‌లో పనిచేసే అధికారులు ఆ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. కొవిడ్‌ కేసులు స్కూళ్లలో ఎక్కడైనా నమోదై ఉంటే వెంటనే బహిర్గతం చేసి, మరికొందరు అటు వైపు వెళ్లకుండా చూడటంతోపాటు, ఇతరులు సైతం అనార్యోగం పాలుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐటీ సెల్‌ అధికారులు కరోనా కేసులపై కూడా పెదవి విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2022-01-22T06:23:26+05:30 IST