సీఎం జగన అసమర్థ పాలకుడు

ABN , First Publish Date - 2022-12-15T00:04:26+05:30 IST

రాష్ట్రంలో సీఎం జగన మోహన రెడ్డి అసమర్థ పాలన సాగిస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన అసమర్థ పాలకుడు

- మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

రొళ్ల, డిసెంబరు 14: రాష్ట్రంలో సీఎం జగన మోహన రెడ్డి అసమర్థ పాలన సాగిస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రొళ్ల మండలంలోని ఎం.రాయాపురం పంచాయతీ ఎం.ఆర్‌.గొల్లహట్టి, చెర్లొపల్లి, హునిసేకుంట గ్రామాల్లో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. నిత్యావసర సరుకుల నుంచి ఇంటి నిర్మాణాల వరకూ ప్రతి ఒక్కటీ ధరలు పెరిగాయన్నారు. కనీసం పేదలు ఇంటి నిర్మాణం చేపట్టే పరిస్థితి కూడా లేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం జగన రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడని ఆరోపించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ సాధికార డైరెక్టర్‌ హునిసేకుంట ముడిపేగౌడ్‌, కన్వీనర్‌ దాసిరెడ్డి, జనరల్‌ సెక్రెటరీ జి.కె.ఈరన్న, మాజీ ఆస్పత్రి కమిటీ చైర్మన గురుమూర్తి, క్లస్టర్‌ ఇనచార్జ్‌ సిద్దగంగప్ప, ఆర్‌డబ్ల్యుఎస్‌ రిటైర్డ్‌ ఏఈ మల్లికార్జున, మాజీ జడ్పీటీసీ సన్నతిమ్మప్ప, మాజీ ఎంపీపీ పాండురంగప్ప, తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ, తాలూకా యూత ఉపాధ్యక్షులు నాగేంద్ర, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పాండురంగప్ప, యూత భరత, రామకృష్ణ, గోవిందరాజులు, ఎం.రాయపురం పంచాయతీ కన్వీనర్‌ రామచంద్రప్ప, ఉగ్రేగౌడ్‌, మాజీ సర్పంచి కృష్ణమూర్తి, రాజ్‌కుమార్‌, నాగరాజు, లక్ష్మీపతి, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2022-12-15T00:04:27+05:30 IST