మహిళా సంఘాల ధర్నాకు సీఐటీయూ, సీపీఎం మద్దతు
ABN , First Publish Date - 2022-12-16T00:31:43+05:30 IST
స్థానిక వెలుగు కార్యాలయంలో మహిళ సంఘాలకు రుణమాఫీ రాలేదని గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులు, సీపీఎం మండల కార్యదర్శి కుళ్లాయప్ప, సీఐటీయూ మండల కార్యదర్శి బండి చంద్రమౌళి మద్దతు తెలిపారు.
నార్పల, డిసెంబరు 15: స్థానిక వెలుగు కార్యాలయంలో మహిళ సంఘాలకు రుణమాఫీ రాలేదని గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులు, సీపీఎం మండల కార్యదర్శి కుళ్లాయప్ప, సీఐటీయూ మండల కార్యదర్శి బండి చంద్రమౌళి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి పాలకులు మహిళా సంఘాలకు రుణమాఫీలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల సభ్యులను విస్మరించడం పాలకులకు పరిపాటిగా మారిపోయిందన్నారు. స్థానిక అధికారులు స్పందించి నార్పల మండలంలో రుణమాఫీ కాని సంఘాలన్నీంటికీ రుణమాఫీ చేయాలని కోరుతూ వెలుగు ఏపీఎం తిప్పమ్మకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో చేనేత సంఘం రాజు ఆవాజ్ మండల కార్యదర్శి ఖాజామోదీన, షరీఫ్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.