బాల శాస్త్రవేత్తల కార్ఖానాలు

ABN , First Publish Date - 2022-11-24T23:50:06+05:30 IST

డిగ్రీ, పీజీ తరగతుల్లో నిర్వహించాల్సిన సాంకేతిక ప్రయోగాలను పాఠశాల విద్యార్థులే చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌, రోబోటిక్‌, ఎలక్ర్టానిక్‌ సెన్సార్‌ వంటి ప్రయోగాలు చేస్తున్నారు.

బాల శాస్త్రవేత్తల కార్ఖానాలు
విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న పుట్లూరు ఏపీ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు

పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు

సాంకేతిక పాఠాలు బోధిస్తున్న జేఎనటీయూ

రోబోటిక్‌, కంప్యూటర్‌ తరగతులపై శిక్షణ

రాకెట్‌ ప్రయోగానికి డీకోడింగ్‌ రాసిన విద్యార్థులు

ఉమ్మడి జిల్లాలో 30 ప్రయోగశాలల ఏర్పాటు

బాల్యం నుంచే శాస్త్రవేత్తలుగా మారుతున్న విద్యార్థులు

అనంతపురం సెంట్రల్‌ : డిగ్రీ, పీజీ తరగతుల్లో నిర్వహించాల్సిన సాంకేతిక ప్రయోగాలను పాఠశాల విద్యార్థులే చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌, రోబోటిక్‌, ఎలక్ర్టానిక్‌ సెన్సార్‌ వంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలకు పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఆఽధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు వేదిక గా నిలుస్తున్నాయి. టింకరింగ్‌ ల్యాబ్‌ల ద్వారా జేఎనటీయూ ఇన్నోవేషన కేంద్ర సమన్వకర్త డాక్టర్‌ మమత ఆధ్వర్యంలో విద్ర్యార్థులకు సాంకేతికవిద్య ప్రయోగాల పాఠాలు నేర్పుతున్నారు. 2018లో ఉమ్మడి జిల్లాకు దాదాపు 30కి పైగా పాఠశాలలకు టింకరింగ్‌ ల్యాబ్‌లను కేంద్రం మంజూరు చేసింది. కురుగుంట బాలయోగి గురుకుల పాఠశాల, పెద్దపప్పూరు ప్రభుత్వ పాఠశాల, రాప్తాడు మోడల్‌ హైస్కూల్‌ తదితర పాఠశాలల్లో పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకు ప్రత్యేక ల్యాబ్‌ తరగతులను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకను వెలికితీస్తున్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకు లం, కురుగుంట పాఠశాల విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన ఎస్‌ఎ్‌సఎల్‌వీ-01, ఆజాదీశాట్‌ ఈవీఎ్‌సఓ-2 ఉపగ్రహాలకు డేటాకోడింగ్‌, డీ కోడింగ్‌ చేసి ఔరా అనిపించారు.

అత్యాధునిక ప్రయోగశాలలు...

అటల్‌ ఇన్నోవేషన మిషన(ఎయిమ్‌) పేరుతో కేంద్ర ప్రభుత్వం అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌, అటల్‌ ఇంక్యుబేషన సెంటర్‌, మెంటార్‌ ఇండియా, అటల్‌ న్యూ ఇండియా చాలెంజ్‌, అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన సెంటర్‌, ఆత్మ నిర్బర్‌ భారత అరైజ్‌, వెర్నాక్యులర్‌ ఇన్నోవేషన ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో అటల్‌ టింకరింగ్‌ లేబొరేటరీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించి పాఠశాల విద్యార్థులకు నూతన ఆవిష్కరణలపై శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు కొత్తగా, భిన్నంగా అలోచింపజేయడం, సమస్యలను గుర్తించి పరిష్కారాన్ని కనుక్కోవడం వంటి సామర్థ్యాన్ని ల్యాబ్‌ల ద్వారా పెంపొందిస్తారు. ఆర్టిఫి షియల్‌ ఇంటెలిజెన్స, వర్చువల్‌ రియాలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న ఇంటర్‌నెట్‌, సాంకేతికత, రోబోటిక్స్‌ అవసరాలను పారిశ్రామిక రంగానికి అందించేయడమే టింకరింగ్‌ ల్యాబ్‌ల ముఖ్య ఉద్దేశం. ఒక్కో సెంటర్‌లో దాదాపు రూ.12లక్షల విలువైన రోబోటిక్స్‌, కం ప్యూటర్‌, మెకానికల్‌, ఎలక్ర్టిక్‌, ఎలక్ర్టానిక్స్‌, మెజర్‌మెంట్‌ టూల్స్‌ వంటి అత్యాధునిక ప్రయోగ పరికరాలను ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-11-24T23:50:07+05:30 IST