గరుడవాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2022-09-11T05:27:25+05:30 IST

పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవలో స్వా మివారు ఊరేగారు.

గరుడవాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
లక్ష్మీచెన్నకేశవస్వామిని గరుడ వాహనంపై ఊరేగిస్తున్న దృశ్యం


ధర్మవరం, సెప్టెంబరు 10: పట్టణంలోని చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవలో స్వా మివారు ఊరేగారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామివారిని ఆశీనులను చేసి పట్టణవీధుల గుండా ఊరేగించారు. ఆలయ కమిటి చైర్మన సుబ్రహ్మణ్యంమాట్లాడుతూ... ప్రతినెల పౌర్ణమి రోజున స్వామి వారిని పట్టణంలో ఊరేగిస్తామన్నారు. ఊరేగింపులో అన్నమయ్య సేవామండలి అధ్యక్షుడు పొరాళ్ల పుల్లయ్య ఆధ్వర్యంలో బృందం సభ్యు లు అన్నమయ్యసంకీర్తనలు ఆలపించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కుండాచౌడయ్య, డైరెక్టర్‌లు పొరాళ్లపద్మావతి పుల్లయ్య, అనసూయ, జగ్గా జయలక్ష్మి, సత్రశాల అశ్వత్థ, అజంత కిష్ట తదితరులు పాల్గొన్నారు. 


Read more