పేర్లు మార్చడం పిచ్చితుగ్లక్‌కే చెల్లు

ABN , First Publish Date - 2022-10-18T05:28:36+05:30 IST

పేర్లు మార్చడం, రంగులు వేయడం పిచ్చితుగ్లక్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే చెల్లుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు.

పేర్లు మార్చడం పిచ్చితుగ్లక్‌కే చెల్లు
మాట్లాడుతున్న పార్థసారథి

సీఎం జగనపై పార్థసారథి ధ్వజం

రొద్దంలో టీడీపీ రిలే దీక్ష


రొద్దం, అక్టోబరు 17: పేర్లు మార్చడం, రంగులు వేయడం పిచ్చితుగ్లక్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే చెల్లుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై టీడీపీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సో మవారం ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు. బీకే మాట్లాడుతూ.. దివంగ త ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఢిల్లీ పెద్దలను ఒప్పించి, విశ్వ వి ద్యాలయాన్ని తీసుకొచ్చినందుకు ఆయన పేరు పెట్టారన్నారు. అ లాంటి మహానుభావుడి పేరు మార్చడం సరికాదన్నారు. చేతనైతే వి శ్వవిద్యాలయాలు వంద కట్టించి, ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర్‌ రె డ్డి పేరు పెట్టుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కా ర్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, అధికార ప్రతినిధి నరసింహులు, పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నప్పయ్య, కన్వీనర్‌ నరహరి, టైలర్‌ ఆంజనేయులు, సర్పంచ మం జునాథ్‌, తురకలాపట్నం నాగేంద్ర, తెలుగు మహిళ లీలావతి, నా యకులు అశ్వత్థనారాయణ, రాము, రామచంద్ర, రామకృష్ణ, చిన్నమంతూరు వెంకటేశులు, గోవిందరాజులు, మురళి, గోపాల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T05:28:36+05:30 IST