మార్కెట్ యార్డ్‌లో చెట్ల తొలగింపుపై కేసు
ABN , First Publish Date - 2022-01-20T06:05:43+05:30 IST
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో చెట్ల తొ లగింపుపై అటవీశాఖ అదికారులు బుధవారం కేసునమోదు చేశారు.

అనంతపురం రైల్వే, జనవరి19: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో చెట్ల తొ లగింపుపై అటవీశాఖ అదికారులు బుధవారం కేసునమోదు చేశారు. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. సంబంధిత అధికారలు అందుబాటులో లేకపోవడంతో ఫోనలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వారు తమకేమీ తెలియదన్నట్లు సమాచారం. సంవత్సరాల తరబడి పెంచిన చెట్లను నరికేస్తుంటే అసలు అటవీశాఖ అధికారులు ఏమి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఖరికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా అటవీశాఖ యంత్రాంగం స్పందించింది. మార్కెట్ యార్డులో ఏకంగా కొన్నేళ్లుగా పెంచిన పెద్ద పెద్ద 40 చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా కొట్టేయడం పలు విమర్శలకు దారి తీస్తోంది. అధికా రికంగా తొలగిస్తున్నారా? లేక రాజకీయ అండదండ లతో వాటిని తొలగించి తరలిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థక ంగా మారింది. ఏది ఏమైనప్పటికి సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ రేంజర్ సూర్యచంద్రరాజు సిబ్బందితో మార్కెట్ యార్డ్‌కు వెళ్లి పరిశీలించారు. తొలగించిన మొద్దులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో పాటు అటవీశాఖ నుంచి అనుమతి లేకుండా చెట్ల తొలగింపుపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం తగిన చర్యలు చేపడుతామని రేంజర్ సూర్యచంద్రరాజు తెలిపారు.