నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి !

ABN , First Publish Date - 2022-12-10T00:24:24+05:30 IST

విద్యుతశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో ఈడిగ శ్రీహరి(26) విద్యుత షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామంలోని ట్రాన్సఫార్మర్‌ ఎర్త్‌ఫెయిల్‌ కావడంతో ఇళ్లకు విద్యుత సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.

నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి !
శ్రీహరి (ఫైల్‌)

- ముత్తవకుంట్లలో విద్యుదాఘాతంతో యువకుడి మృతి

- ట్రాన్సఫార్మర్‌ ఎర్త్‌ ఫెయిల్‌ కావడంతో ప్రమాదం?

- గ్రామంలో పలువురికి కరెంట్‌ షాక్‌

కనగానపల్లి, డిసెంబరు 9: విద్యుతశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో ఈడిగ శ్రీహరి(26) విద్యుత షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామంలోని ట్రాన్సఫార్మర్‌ ఎర్త్‌ఫెయిల్‌ కావడంతో ఇళ్లకు విద్యుత సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇళ్లకు విద్యుత సరఫరా జరగడంతో మల్లేల అశ్వని, సరోజమ్మ, ఈడిగ నాగరాజు, యలమంద, సుబ్రహ్మణ్యం, సరిపూటి ఆనంద్‌ స్వల్పంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఈడిగ శ్రీహరి పెనుకొండలోని కియ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్లేందుకు బాతరూమ్‌లోకి వెళ్లి లైట్‌ స్వీచ్చాన చేస్తుండగా విద్యుత షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సమయంలో గ్రామంలోని పది ఇళ్లకు విద్యుత సరఫరా జరిగి పలువురు గాయపడ్డారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కనగానపల్లి ఏఈ మదనతో పాటు ఎస్‌ఐ ఆంజనేయులు గ్రామానికి వెళ్లి ప్రమాదంపై విచారణ చేపట్టారు. విద్యుత శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని గ్రామస్థులు వారిని చుట్టుముట్టారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్‌ చేశారు. గ్రామంలోని ట్రాన్సఫార్మర్‌ నుంచి ఇళ్లకు విద్యుత సరఫరా అవుతు న్న విషయం అధికారులకు తెలిసినప్ప టికీ తగు చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

టీడీపీ నాయకులు పరామర్శ

ముత్తవకుంట్లలో విద్యుదాఘాతంతో యువకుడు ఈడిగ శ్రీహరి మృతి చెందా డన్న విషయం తెలుసుకున్న టీడీపీ నా యకులు గ్రామానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. బాధిత కుటుంబా న్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ మండల కన్వీనర్‌ యాతం పోతలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నెట్టెం వెంకటేష్‌, సర్పంచ రామాంజినేయులు, ముకుందనాయుడు, పతకమూరి ఆంజనేయులు, బాలనరసింహయాదవ్‌, సరిపూటి ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-10T00:24:26+05:30 IST