పింఛన్లు తొలగించడం అన్యాయం: పరిటాల సునీత
ABN , First Publish Date - 2022-12-31T00:11:40+05:30 IST
నిబంధనల పేరుతో పేదల పింఛన్లు తొలగించడం అన్యాయమని మాజీమం త్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్ర మాన్ని శుక్రవారం కేఎనపాళ్యం గ్రా మంలో నిర్వహించారు.
కనగానపల్లి, డిసెంబరు 30: నిబంధనల పేరుతో పేదల పింఛన్లు తొలగించడం అన్యాయమని మాజీమం త్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్ర మాన్ని శుక్రవారం కేఎనపాళ్యం గ్రా మంలో నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న ఆమె ఇంటింటికీ వెళుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు తొలగిం చారని, సంక్షేమపథకాలు మాకేం అందలేదని, గ్రామంలో సీసీరోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు మాజీమంత్రికి వివరించారు. అనంతరం గ్రామంలో ప్రమాదవశాత్తు, కరోనాతో కుటుంబ యాజమాని కోల్పోయిన బాధితులను పరామర్శించారు. గ్రామంలోని రచ్చకట్ట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింద న్నారు. తెలుగుదేశం పాలనలో పుట్టిన బిడ్డ నుంచి కాటికెళ్లేవరకు సంక్షే మ పథకాలు అందుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందన చూసి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి భయం పట్టుకుం దన్నారు. అర్హులైన వారికి ఫించన్లు తొలగిస్తే తామే ఫించనదారులతో కలిసి ధర్నా చేసి వారికి న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు. రిజర్వాయర్ల ఏర్పా టుకు నిధులు తెస్తే వాటిని పక్కకు మళ్లించి వాటిలో కనీసం గంపడు మట్టికూడా ఎమ్మెల్యే తీయలేదని విమర్శించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ఎమ్మెల్యే కనీసం పిల్లకాలువను కూడా తవ్వించలేని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. శివపురం, కొట్టాల, కేఎనపాళ్యం గ్రామంలోని కార్యకర్తలు పాల్గొన్నారు.