హావళిగిలో చోరీ
ABN , First Publish Date - 2022-12-16T00:11:20+05:30 IST
మండలంలోని హా వళిగి గ్రామంలో అంపయ్య శెట్టి ఇంట్లో చోరి జరిగి 14 తులాలు బంగారం, రూ. 50 వేలు నగదును గుర్తు తెలి యని వ్యక్తులు దోచుకెళ్లారు.
14 తులాల బంగారం, రూ. 50 వేల నగదు అపహరణ
విడపనకల్లు, డిసెం బరు 15: మండలంలోని హా వళిగి గ్రామంలో అంపయ్య శెట్టి ఇంట్లో చోరి జరిగి 14 తులాలు బంగారం, రూ. 50 వేలు నగదును గుర్తు తెలి యని వ్యక్తులు దోచుకెళ్లారు. పాల్తూరు ఎస్ఐ రామచం ద్రప్ప తెలిపిన వివరాలు మేర కూ హావళిగి గ్రామానికి చెంది న అంపయ్యశెట్టి తన కుటుంబంతో కలిసి 10వ తేదీన తిరుమలకు వెళ్లాడు. గురువారం సాయం త్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి లోప లకు వెళ్లి చూడగా బీరువాను ధ్వంసం చేసినట్లు గమనించారు. వెంటనే పాల్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా తన సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా 14తులాలు బంగారం. రూ.50 నగదు చోరీకి గురైందని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.