ఛిద్రమైన రోడ్లు

ABN , First Publish Date - 2022-09-20T04:54:33+05:30 IST

పట్టణం నుంచి కర్ణాటక సరిహద్దుకే వెళ్లే ప్రధాన రహదారి ఛిద్రమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అడుగడుగునా గుంతలమయమైంది.

ఛిద్రమైన రోడ్లు
అప్పలకుంట సమీపంలో గుంతలుపడి కంకర తేలిన తారు రోడ్డు

అడుగడుగునా గుంతలు..

తీరని ప్రయాణ కష్టాలు


హిందూపురం అర్బన, సెప్టెంబరు, 19: పట్టణం నుంచి కర్ణాటక సరిహద్దుకే వెళ్లే ప్రధాన రహదారి ఛిద్రమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అడుగడుగునా గుంతలమయమైంది. పట్టణం నుం చి సరిహద్దుకు కేవలం కేవలం 11 కిలోమీటర్ల దూరం ఉంది. అదే తూమకుంట పారిశ్రామిక వాడకు వెళ్లాలంటే 9 కిలోమీటర్లు ఉం టుంది. తూమకుంట పరిశ్రమల వద్దకు చేరేందుకు 30 నిమిషాల స మయం పడుతోందంటే.. రహదారి ఇంకెంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కనీసం ద్విచక్రవాహనం కూడా గుంతలను త ప్పించి వెళ్లలేని పరిస్థితి. ఇక కార్లు, బస్సులు ఆ దారిలో ఎలా ప్ర యాణించాలి. హిందూపురం నుంచి బెంగళూరు ప్రధాన రహదారి ఇది. పురం నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ బస్సులతోపాటు ప్రై వేట్‌ బస్సులు, కార్లు ఈమార్గంలో 24 గంటలు ప్రయాణిస్తూనే ఉం టాయి. ముఖ్యంగా తూమకుంట పారిశ్రామిక వాడలో ఉపాధి కోసం నిత్యం ఆటోల్లో వేలాది మంది కార్మికులు ప్రయాణం చేస్తుంటారు. దారి మొత్తం గుంతలమయం కావడంతో తరచూ ప్రమాదాలు చో టు చేసుకుంటున్నాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు దాటించే క్ర మంలో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక వర్షాకా లం అయితే గుంతల్లో నీరు చేరి, ఎక్కడ గుంత ఉందో గుర్తించడం చాలా కష్టం. ఇలాంటి సమయాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. ప్రాణాలు పోతే గానీ అధికారులు స్పందించరని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడుగడునా లోతైన గుంతలతో ప్ర యాణం చేయాలంటే నరకయాతన పడాల్సిందే.


రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచాం

నాగరాజు, ఆర్‌అండ్‌బీ డీఈ

హిందూపురం-బెంగళూరు రోడ్డు తూమకుంట వరకు అధ్వానంగా ఉంది. ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది. 13 కిలోమీటర్లు రోడ్డు వే సేందుకు టెండర్లు పిలిచాం. పనులు చేసేందుకు రూ.53 లక్షలు నిధు లు మంజూరయ్యాయి. వర్షాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. త్వరలోనే ప్రారంభించి నూతనంగా రోడ్డు నిర్మాణం చేపడతాం.


Read more