-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Bicycle collision person killed-NGTS-AndhraPradesh
-
ద్విచక్రవాహనం ఢీ - వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-07T06:22:41+05:30 IST
పట్టణ పరిధిలోని చౌడేశ్వరీ కాలనీలో ఆదివారం ద్విచక్రవాహనం ఢీకొని అదే కాలనీకి చెందిన నారాయణస్వామి (55) మృతి చెందాడు.

హిందూపురం టౌన, జూన 6: పట్టణ పరిధిలోని చౌడేశ్వరీ కాలనీలో ఆదివారం ద్విచక్రవాహనం ఢీకొని అదే కాలనీకి చెందిన నారాయణస్వామి (55) మృతి చెందాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి. నారాయణ స్వామి రోడ్డు దా టుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. తీ వ్రంగా గాయపడిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అ ప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు.