అయ్యంపల్లిలో ఎలుగుబంటి హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-11-30T00:09:48+05:30 IST

కంబదూరు మండలంలోని అయ్యంపల్లిలో ఓ ఎలుగు బంటి గ్రామంలోకి వచ్చి హల్‌చల్‌ చేస్తోంది.

  అయ్యంపల్లిలో ఎలుగుబంటి హల్‌చల్‌

కంబదూరు (కళ్యాణ దుర్గం), నవంబరు 29: కంబదూరు మండలంలోని అయ్యంపల్లిలో ఓ ఎలుగు బంటి గ్రామంలోకి వచ్చి హల్‌చల్‌ చేస్తోంది. గత వారంరోజుల నుంచి గ్రామం లోకి వచ్చి ఇళ్లమధ్య తిరుగు తూ నానా హంగామా సృష్టి స్తోంది. మంగళవారం తెల్లవారుజామున గ్రామం లోని దేవాలయంలోకి వచ్చి అక్కడ ఉన్న దీపాలు, అగరబత్తీలను చిందర వందరంగా చేస్తోంది. అయితే తెల్లవారుజామున ఇదే గ్రామానికి చెందిన చరణ్‌ అనే యువకుడికి ఆ ఎలుగుబంటి అడ్డురావడంతో తప్పించుకు నేందుకు పోయి కిందకు పడి గాయాలు పాలయ్యాడు. వారం రోజుల నుం చి ఎలుగుబంటి సంచరిస్తున్నా అటవీశా ఖాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దేవాలయంలో ఎలుగు బంటి తిరుగుతున్న వీడియోను తీసి, ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాల్‌ వైరల్‌గా మారింది. ఈ ఎలుగు బంటి సంచరిం చడంతో తోటల్లోకి కూడా వెళ్లకుండా భయపడుతూ రైతులు ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించి, మమ్మల్ని రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-30T00:09:48+05:30 IST

Read more