టీడీపీకి బీసీలే వెన్నెముక

ABN , First Publish Date - 2022-07-18T06:04:28+05:30 IST

తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు అన్నారు. ఆదివారం ఉదయం జితేంద్రగౌడు క్యాంపు కార్యాలయంలో బీసీ సెల్‌ నాయకుల పదవీ స్వీకార కార్యక్ర మాన్ని నిర్వహించారు.

టీడీపీకి బీసీలే వెన్నెముక
బీసీ సెల్‌ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న జితేంద్రగౌడుమాజీ శాసనసభ్యుడు జితేంద్రగౌడు

గుంతకల్లు, జూలై 17 : తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు అన్నారు. ఆదివారం ఉదయం జితేంద్రగౌడు క్యాంపు కార్యాలయంలో బీసీ సెల్‌ నాయకుల పదవీ స్వీకార కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి బీసీలకు పెద్ద పీట వేశారన్నారు. రాజకీయ అధికారం అనేది తెలియని బీసీలను చట్ట సభలకు తెచ్చారన్నారు. ఆ తర్వాత చంద్రబా బు నాయుడు కూడా బీసీలకే ప్రాధాన్యతనిచ్చారని తెలిపా రు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు, అసత్య హామీ ల కారణంగా బీసీలు పొరపాటుగా ఓటువేసి జగనకు అధికారాన్ని ఇచ్చారన్నారు. తర్వాత జరుగుతున్న పరిణా మాల కారణంగా ఎందుకైనా గెలిపించామా? అని చింతిస్తు న్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠాన్ని నేర్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు పోయిందన్నారు. టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన కుమార్‌ గౌడు మాట్లాడుతూ... వైసీపీ నాయకులు బెదిరింపులకు భయపడేది లేదని, రానున్న ఎన్నికల్లో బీసీలు కలసికట్టుగా తగిన గుణపాఠాన్ని నేర్పుతారని అన్నారు. అనంతరం కార్యక్రమంలో వివిధ పదవులు పొందిన నాయకులు పవన కుమార్‌ గౌడు, పాల మల్లికార్జున,  కేశప్ప, సుధాకర్‌, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్‌ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశ్వర్లు, నాయకులు తలారి మస్తానప్ప, గుజరీ ఖాజా, ముక్కన్నగారి రామాంజనేయులు, కే సురేశ, రామన్న చౌదరి, ఫ్రూట్‌ మస్తాన, శివన్న పాల్గొన్నారు.

Read more