ప్రశాంతి నిలయంలో ఘనంగా ఆయుధపూజ

ABN , First Publish Date - 2022-10-04T04:31:56+05:30 IST

ప్రశాంతి నిలయంలో సోమవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.

ప్రశాంతి నిలయంలో ఘనంగా ఆయుధపూజ
సత్యసాయి రథానికి పూజ చేస్తున్న ఆర్‌జే రత్నాకర్‌

పుట్టపర్తి, అక్టోబరు 3: ప్రశాంతి నిలయంలో సోమవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. సాయికుల్వంత సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం బంగారు రథం, సత్యసాయి వినియోగించిన కార్లను ప్రత్యేకంగా అలంకరించి  ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, డాక్టర్‌మోహన ఘనంగా ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం ముందుకు తీసుకెళ్లారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తనివేదనం పేరిట భక్తి పాటలు ఆలపించారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఐదోరోజు రుత్వికులు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగించారు. - రేషనషాపుల్లో కనిపించని పంచదార 

- డీడీలు కట్టినా సరఫరా చేయని వైనం

 - కందిపప్పు పంపిణీ అంతంతే

Read more