హార్టికల్చర్‌ బీఎస్సీ కోర్సుకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-09-13T05:18:11+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా వెంకట రామన్న గూడెంలోని వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్‌ బీఎస్సీ (హానర్స్‌) కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ డాక్టర్‌ శ్రీనివాసులు ఒక ప్రకటనలో కోరారు.

హార్టికల్చర్‌ బీఎస్సీ కోర్సుకు దరఖాస్తులు

అనంతపురం అర్బన, సెప్టెంబరు 12: పశ్చిమగోదావరి జిల్లా వెంకట రామన్న గూడెంలోని వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్‌ బీఎస్సీ (హానర్స్‌) కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ డాక్టర్‌ శ్రీనివాసులు ఒక ప్రకటనలో కోరారు. ఏపీ ఈఏపీసెట్‌-2022లో ర్యాంకులు సాధించిన బైపీసీ అభ్యర్థులతో పాటు ఇంటర్‌లో బైపీసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎనఆర్‌ఐ కోటాద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన ఆధారిత పరిశ్రమల వారికోటా ద్వారాకూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 30వతేదీ దాకా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఛీటడటటజిఠ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తును డౌనలోడ్‌ చేసుకోవాలన్నారు. పూరించిన దరఖాస్తుతో పాటు తగిన సర్టిఫికెట్లు, డిమాండ్‌ డ్రాప్ట్‌ లేదా ఆనలైన చెల్లింపు రసీదును నిర్దేశించిన తేదీలోగా విశ్వవిద్యాలయానికి పంపాలన్నారు.


Updated Date - 2022-09-13T05:18:11+05:30 IST