సమస్య తీరే తోవ ఏదీ?
ABN , First Publish Date - 2022-12-16T23:54:29+05:30 IST
దారిలేక చిన్నముష్టూరు సమీపంలోని ఆదర్శపాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఈ విద్యాలయాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ గ్రామం నుంచి రహదారి నిర్మించిన దాఖలాలేవు
ఏళ్లు గడుస్తున్నా తీరని రోడ్డు సమస్య
రహదారి లేక విద్యార్థుల అవస్థలు
పట్టించుకోని పాలకులు
ఉరవకొండ, డిసెంబరు 16: దారిలేక చిన్నముష్టూరు సమీపంలోని ఆదర్శపాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఈ విద్యాలయాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ గ్రామం నుంచి రహదారి నిర్మించిన దాఖలాలేవు. ఈ రెండు విద్యాలయా ల్లో 500 మంది దాకా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2013లో పాలిటెక్నిక్, మోడల్స్కూల్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇరుకైన దారిలోనే పాఠశాల, కళాశాలకు ఆర్టీసీ బస్సు విద్యార్థులతో వెళుతోంది. ఏమాత్రం పొరపాటు జరిగినా బస్సు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు రోజు భయాందోళనతోనే ప్రయాణిస్తున్నారు. దారి నిర్మించాలని అనేక సార్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ఇప్పటి వరకూ చర్యలు చేపట్టలేదు.
విద్యార్థులకు భద్రత కరువు
చిన్నముష్టూరు నుంచి కళాశాలకు వెళ్లేందుకు 2 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థినులు ఈ రోడ్డు మార్గం గుండా ఒంటరిగా వెళ్లడానికి భయపడుతున్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు రహదారి లేకపో వడం వల్ల అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన నిధులు రావాలంటే కళాశాలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. కానీ రోడ్డు మార్గమే లేదని, దీని వల్ల నిధులు కూడా కోల్పోవాల్సి వస్తోందని పాలి టెక్నిక్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. రహదారి నిర్మించాలని పంచాయతీ రాజ్ కమిషనర్, జిల్లా మేజిస్ర్టేట్కు కూడా వినతి పత్రాలు అందజేశారు. 1.8 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షల ప్రతిపాదనలతో ప్రభుత్వానికి పంపారు. ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు నిర్మించే అవకాశమున్నా చర్యలు చేపట్టడం లేదు.