చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: గుండుమల
ABN , First Publish Date - 2022-07-06T05:29:13+05:30 IST
వచ్చేఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు కృషి చేయాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు.

మడకశిర టౌన, జూలై 5: వచ్చేఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా కార్యకర్తలు కృషి చేయాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం స్థాని క బాలాజీ నగర్లోని పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మంజునాథ్. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భక్తర్తో పాటు పలువురిని సన్మానించారు. ఈసందర్భంగా గుండుమల మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ అభ్యున్నతి, సంక్షేమానికి టీడీపీ పాటుపడుతోందన్నారు. నాయకులకు పదవులు శాశ్వతం కా దని, ప్రజల సమస్యలు పరిష్కరించడమే నిజమైన సేవ అన్నారు. రాష్ట్రంలో రాక్షస పా లన సాగుతోందని, చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 2024 ఎన్నికలే ల క్ష్యంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివా్సమూర్తి, బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ నాగరా జు, పట్టణ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, యువత అధ్యక్షుడు నాగరాజు, తిమ్మరాజు, రొళ్ళ, గుడిబండ కన్వీనర్లు మద్దనకుంటప్ప, దాసిరెడ్డి, నాయకులు కన్నా, రంగస్వామి పాల్గొన్నారు.