ఏఎనఎంల సర్దుబాటు

ABN , First Publish Date - 2022-12-07T00:10:15+05:30 IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలను గుర్తించి మంగళవారం వైఎస్సార్‌ క్లినిక్‌లకు సర్దుబాటు చేశారు. రెండు నెలల క్రితమే కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు.

ఏఎనఎంల సర్దుబాటు
ఏఎనఎంలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీఎంహెచఓ

అనంతపురం టౌన డిసెంబరు6: అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలను గుర్తించి మంగళవారం వైఎస్సార్‌ క్లినిక్‌లకు సర్దుబాటు చేశారు. రెండు నెలల క్రితమే కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులు ప్రయత్నించారు. అయితే కోర్టు అడ్డంకులు ఉండటంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా ప్రభుత్వం అనుకున్న మేరకు ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎనఎంలను వైఎస్సార్‌ క్లినిక్‌లకు సర్దుబాటు చేసేశారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచఓ డాక్టర్‌ యుగంధర్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ చేపట్టారు. మొత్తం 151 మంది ఏఎనఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచఓ డాక్టర్‌ సుజాత, ఏఓ ప్రభాకర్‌ మోసస్‌, సీనియర్‌ అసిస్టెంట్లు కమలాకర్‌రాజు, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:10:16+05:30 IST