సేద్యానికి సాంకేతికత జోడింపుపై కార్యాచరణ

ABN , First Publish Date - 2022-12-30T00:02:07+05:30 IST

వ్యవసాయ రంగానికి సాంతికేతికతను జోడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జేఎనటీయూ వీసీ రంగజనార్దన తెలిపారు.

సేద్యానికి సాంకేతికత జోడింపుపై కార్యాచరణ
సదస్సు బృందంతో జేఎనటీయూ, ఎస్కేయూ వీసీలు

జేఎనటీయూ వీసీ రంగజనార్దన

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 29: వ్యవసాయ రంగానికి సాంతికేతికతను జోడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జేఎనటీయూ వీసీ రంగజనార్దన తెలిపారు. గురువారం గుంటూరు ఆచార్య ఎనజీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన ప్లానింగ్‌ బోర్డు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ‘కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం’ అనే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే సదస్సుకు జేఎనటీయూ వీసీ రంగజనార్దన, రెక్టార్‌ విజయకుమార్‌, ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎనటీయూ వీసీ మాట్లాడుతూ సామాజిక బాధ్యతకు ఉన్నత విద్యా సంస్థలు ఎలా సహాయపడాలన్న అంశాలను సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రణాళిక మేరకు ఆచరణను అమలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు. సాంకేతికత వినియోగంతో కలిగే లాభాలపై రైతులకు వివరించేలా కార్యాచరణలు రూపొందించినట్లు వివరించారు. అదేవిధంగా కమ్యూనిటీ సర్వీసె్‌సకు ఎలాంటి సహాయం చేయవచ్చు. విద్యార్థులను ఎలా మోటివేషన చేయాలి. పాఠ్యాంశాలను భోదించడమే కాకుండా సొసైటీలోకి పంపి వారి అవసరాలను గుర్తించేవిధంగా అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇన్ఫోసిస్‌ సంస్థతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. రోజు రోజుకు సాంతికేతికతలో వస్తున్న మార్పులు నేర్చుకోవడం వంటి అంశాలపై ఇన్ఫోసిస్‌ సంస్థ ఉచితంగా శిక్షణ ఇస్తుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల వర్సిటీ క్లస్టర్‌గా జేఎనటీయూ మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి ప్రక్రియలు, పరిశోధనల కార్యకలాపాలు తదితర అంశాలపై వివరించినట్లు వెల్లడించారు.

Updated Date - 2022-12-30T00:02:08+05:30 IST