హరిహర సుతునికి లక్షపుష్పార్చన
ABN , First Publish Date - 2022-12-15T00:48:57+05:30 IST
అయ్యప్పస్వామి దీక్ష మండల పూజలను పురస్కరించుకుని మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామివారికి బుధవారం లక్షపుష్పార్చన సేవ నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 14: అయ్యప్పస్వామి దీక్ష మండల పూజలను పురస్కరించుకుని మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామివారికి బుధవారం లక్షపుష్పార్చన సేవ నిర్వహించారు. ఈ వేడుకకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గురుస్వాములు హాజరయ్యారు. స్వామివారి మూలవిరాట్ను పంపానది జలాలతో అభిషేకించారు. భస్మాభిషేకం నిర్వహించి.. ప్రత్యేకంగా అలంకరించారు. రంగాచారి గురుస్వామి నేతృత్వంలో వేదపండితులు స్వామివారికి లక్ష పుష్పార్చన చేశారు. అయ్యప్పదీక్షధారుల శరణుఘోష, భక్తిగీతాలాపనతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పూజల అనంతరం అయ్యప్ప దీక్షధారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.