నిరుపయోగంగా సప్లై చానల్‌

ABN , First Publish Date - 2022-10-18T05:29:56+05:30 IST

మండలంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల చెరువుల్లోని నీటిని ఒడిసిపట్టడంలో అధికారులు వి ఫలమవుతున్నారు.

నిరుపయోగంగా సప్లై చానల్‌
వృథాగా కర్ణాటకకు తరలుతున్న కల్లుమర్రి చెరువు మరువ నీరు

కర్ణాటకకు తరలుతున్న చెరువు నీరు


మడకశిర రూరల్‌, అక్టోబరు 17: మండలంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల చెరువుల్లోని నీటిని ఒడిసిపట్టడంలో అధికారులు వి ఫలమవుతున్నారు. ఫలితంగా మరువ నీరంతా కర్ణాటక ప్రాంతాల కు తరలుతోంది. ఏళ్లకాలంగా ఇదేతంతు సాగుతోంది. కళ్లెదుటే నీరం తా తరలుతుండడంతో పలు గ్రామాల ప్రజలకు వర్షాభావ పరిస్థితు లు తప్పడం లేదు. మండలంలోని కల్లుమర్రి గ్రామం కర్ణాటకలోని పావగడ తాలూకాకు సరిహద్దుగా ఉంది. ఈగ్రామ చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తొణికిసలాడుతోంది. మరువ పారుతుండ డంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ గ్రామా నికి పక్కనే ఉన్న యల్లోటి వాసులకు మాత్రం చేదు అనుభవం ఎ దురవుతోంది. ఈగ్రామ చెరువు ఒట్టిపోయింది. కల్లుమర్రి చెరువు నిండి మరువ పారుతున్న నీటిని యల్లోటి చెరువుకు తరలించాలని పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అనుకున్నదే తడవు గా సుమారు రూ.25 లక్షల వ్యయంతో సప్లై చానల్‌ను తవ్వించారు. కల్లుమర్రి చెరువు నిండిన తర్వాత వృథా నీటిని ఈ సప్లై చానల్‌ ద్వారా యల్లోటి చెరువుకు తరలించాల్సి ఉంది. అయితే కాలువ ప నులు దాదాపు పూర్తయి, పదేళ్లుగా నిరుపయోగంగా మారింది. కల్లు మర్రి చెరువు వద్ద సప్లై ఛానల్‌ను అనుసంధానిస్తూ నిర్మాణాలు చే పట్టలేక పోయారు. ఫలితంగా కల్లుమర్రి చెరువు మరువ నీరంతా వృథాగా సరిహద్దున ఉన్న కర్ణాటక ప్రాంతాలకు తరలుతోంది. యల్లోటి చెరువు మాత్రం బోసిపోయింది. సప్లై చానల్‌ ద్వారా నీటిని పంపడంలో ఇరిగేషన  అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పదేళ్లుగా సప్లై చానల్‌ నోరెళ్లబెడుతున్నా, నీ టి గలగలలు మాయమయ్యాయి. ఇప్పటికైనా ఇరిగేషన అధికారులు  చర్యలు చేపట్టి సప్లై చానల్‌ను ఉపయోగంలోకి తీసుకువచ్చి యల్లోటి చెరువుకు నీరు మళ్లించాలని రైతులు కోరుతున్నారు.


రెండు నెలలుగా చెరువు నీరు వృథా..:

గుర్రప్ప, రైతు, కల్లుమర్రి

భారీ వర్షాలతో కల్లుమర్రి చెరువు నిండి రెండు నెలలుగా మరువ పోతోంది. నీరంతా వృథాగా క ర్ణాటకకు తరలుతోంది. ఈచెరువు నీటిని యల్లోటి చెరువుకు తరలించి నింపడం కోసం గత ప్రభు త్వం సప్లైఛానల్‌ తీసింది. అయితే నీటిని మళ్లించడంతో అధికారులు విఫలమవుతున్నారు.


సప్లై చానల్‌ ద్వారా నీటిని మళ్లించాలి:

నరసింహులు, రైతు, యల్లోటి

యల్లోటి చెరువుకు నీటి వనరులు తక్కువ. రెండు నెలలగా భారీ వర్షాలు కురిసి మండలంలో అన్ని చెరువులు నిండాయి. అయితే యల్లోటి చె రువు మాత్రం నిండలేదు. కల్లుమర్రి చెరువు నిం డి వృథాగా నీరు కర్ణాటకకు పోతోంది. ఇరిగేషన అధికారులు సస్లైఛానల్‌ ద్వారా కల్లుమర్రి  చెరు వు నీటిని మళ్లించాలి


ప్రతిపాదనలు పంపాం : భార్గవ్‌, ఇరిగేషన ఏఈ

కల్లుమర్రి చెరువు నుంచి యల్లోటి చెరువుకు నీటిని మళ్లించే సప్లైఛానల్‌ పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.  నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం.


Updated Date - 2022-10-18T05:29:56+05:30 IST