ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2022-12-15T00:05:56+05:30 IST

పట్టణం లోని ఆలూరు రోడ్డులో బుధవారం ద్విచక్రవా హనంను టిప్పర్‌ ఢీ కొనడంతో రైల్వే ఉద్యోగి ఓబు ళపతి (59) మృతిచెందగా,

ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

గుంతకల్లుటౌన్‌, డిసెంబరు 14: పట్టణం లోని ఆలూరు రోడ్డులో బుధవారం ద్విచక్రవా హనంను టిప్పర్‌ ఢీ కొనడంతో రైల్వే ఉద్యోగి ఓబు ళపతి (59) మృతిచెందగా, మరో రైల్వే ఉద్యోగి షేక్షావలి గాయపడ్డాడు. పట్టణంలోని మస్తాన్‌పేటలో నివాసముంటున్న ఓబుళపతి బేవినహాల్‌ రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌ మేస్త్రీగా పని చేస్తున్నాడు. షేక్షావలి బేవినహాల్‌లో ట్రాక్‌మ న్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు రోజూ మాదిరిగా ద్విచక్ర వాహనంలో విధులకు బయలుదేరారు. ఆలూరు రోడ్డులో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓబుళపతి అక్కడికక్కడే మృతిచెందగా, షేక్షావలికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. ఓబుళపతి ఆరు నెలల్లో రిటైర్‌ కానున్నా డు. మృతుడికి భార్య పుష్పావతి, కుమార్తె ఉన్నారు. ఓబుళపతి మృతి చెంది న విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకు న్నారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:05:57+05:30 IST